Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Multi Dal Adai Dosa : అన్ని ర‌కాల ప‌ప్పుల‌తో చేసే అడై దోశ‌.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

D by D
October 27, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Multi Dal Adai Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో దోశ ఒక‌టి. దోశ‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం ఈ దోశ‌ల‌ను కూడా వివిధ రుచుల్లో, వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటాం. వీటిల్లో అడై దోశ ఒక‌టి. అడై దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిని తిన‌డం వ‌ల్ల వివిధ ర‌కాల పోష‌కాలు శ‌రీరానికి అందుతాయి. కేవ‌లం మిన‌ప‌ప్పునే కాకుండా ఇత‌ర ప‌ప్పుల‌ను కూడా మ‌నం ఈ అడై దోశ త‌యారీలో ఉప‌యోగిస్తాము. ఆరోగ్యానికి మేలు చేసే ఈ అడై దోశ‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అడై దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బియ్యం – ఒక క‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు – అర క‌ప్పు, మిన‌ప‌ప్పు- అర క‌ప్పు, కందిప‌ప్పు – పావు క‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు – పావు క‌ప్పు, ఎండుమిర్చి – 5, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన అల్లం ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన క‌రివేపాకు – కొద్దిగా , జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క్యారెట్ తురుము – అర క‌ప్పు.

Multi Dal Adai Dosa very healthy make in this method recipe
Multi Dal Adai Dosa

అడై దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యం, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, కందిప‌ప్పు, పెర‌ప‌ప్పు, ఎండుమిర్చి వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ అడై దోశ పిండి ఊత‌ప్పం పిండిలా గ‌ట్టిగా ఉండేలా చేసుకోవాలి. త‌రువాత ఈ పిండిలో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేయాలి. త‌రువాత త‌గినంత పిండి తీసుకుని పెనం మీద వేయాలి. ఇప్పుడు చేత్తో అర ఇంచు మందం ఉండేలా దోశ ఆకారంలో వ‌త్తుకోవాలి. త‌రువాత దీనిపై నూనెను వేసి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై అర నిమిషం పాటు వేయించాలి.

త‌రువాత దోశను మ‌రో వైపుకు తిప్పి కొద్దిగా నూనె వేసి మ‌ర‌లా మూత పెట్టి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా అదే విధంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అడై దోశ త‌యార‌వుతుంది. దీనిని కొబ్బ‌రి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ లేదా ఏదైనా కారం చట్నీల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో సాధార‌ణ బియ్యానికి బ‌దులుగా బ్రౌన్ రైస్ ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే ఈ అడై దోశ పిండిని పులియ‌బెట్ట కూడ‌దు. పిండి ఎక్కువ‌గా ఉంటే మిక్సీ ప‌ట్టిన వెంట‌నే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. డైటింగ్ చేసే వారు కూడా ఈ దోశ‌ను ఆహారంగా తీసుకోవ‌చ్చు. ఈ దోశ‌ను తిన‌డం వ‌ల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.

Tags: Multi Dal Adai Dosa
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Bedroom : బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ అన్యోన్యంగా ఉంటారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.