Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Hotel Style Sambar : సాంబార్‌ను ఇలా చేస్తే హోట‌ల్ స్టైల్‌లో వ‌స్తుంది.. అన్నం మొత్తం లాగించేస్తారు..

D by D
December 1, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Hotel Style Sambar : మ‌న‌లో చాలా మంది సాంబార్ తో భోజ‌నం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం త‌ర‌చూ ఈ సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సాంబార్ మ‌న‌కు హోట‌ల్స్ లో కూడా ల‌భిస్తుంది. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా రుచిగా ఉండే సాంబార్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. హోట‌ల్స్ లో ల‌భించే ఈ సాంబార్ రుచిగా, చిక్క‌గా చాలా బాగుంటుంది. అంద‌రూ ఇష్టంగా తినే ఈ సాంబార్ ను హోట‌ల్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ సాంబార్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

కందిప‌ప్పు – ముప్పావు క‌ప్పు, నీళ్లు – 200 ఎమ్ ఎల్, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – అర టీ స్పూన్, మిన‌ప‌ప్పు – అర టీ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన బెండ‌కాయ‌లు – 2, గుమ్మ‌డి ముక్క‌లు – పావు క‌ప్పు, త‌రిగిన మున‌క్కాయ – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, చింత‌పండు ర‌సం – 100 ఎమ్ ఎల్, కారం – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, బెల్లం – ఒక ఇంచు ముక్క‌.

Hotel Style Sambar recipe in telugu make in this way
Hotel Style Sambar

సాంబార్ పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 15, ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – ముప్పావు టీ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – పావు క‌ప్పు.

హోట‌ల్ స్టైల్ సాంబార్ త‌యారీ విధానం..

ముందుగా కందిప‌ప‌ప్పును ఒక గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ కందిప‌ప్పును కుక్క‌ర్ లో వేసి నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే ప‌సుపు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చి కొబ్బరి తురుము త‌ప్ప పేస్ట్ కు కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాలు వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి. ఇవి వేగిన త‌రువాత కొబ్బ‌రి తురుము వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండుమిర్చి, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత కూర‌గాయ ముక్క‌లు, ఉప్పు వేసి క‌లిపి వేయించాలి.

కూర‌గాయ ముక్క‌లు 50 శాతం వేగిన త‌రువాత లీట‌ర్ నీళ్లు, ఉడికించిన ప‌ప్పు, మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌లపాలి. త‌రువాత దీనిని మూత పెట్టి 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై మ‌రిగించాలి. త‌రువాత చింత‌పండు రసం, కారం, 2 రెమ్మ‌ల క‌రివేపాకు, బెల్లం ముక్క వేసి క‌లిపి మ‌రో 10 నిమిషాల పాటు మ‌రిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సాంబార్ త‌యార‌వుతుంది. దీనిని ఇడ్లీ అలాగే అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ లో ఇత‌ర కూర‌గాయ ముక్క‌లను కూడా వేసుకోవ‌చ్చు. అలాగే రుచికి త‌గిన‌ట్టు మ‌రికొన్ని నీళ్ల‌ను కూడా పోసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన సాంబార్ ను ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: hotel style sambar
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Hair Growth Tip : జుట్టుకు దీన్ని రాస్తే.. జుట్టు అస‌లు రాల‌దు.. పొడ‌వుగా పెరుగుతుంది..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.