Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Poha Dosa : అటుకుల‌తో అట్ల‌ను ఇలా వేయండి.. బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే లాంటి టేస్ట్ వ‌స్తుంది..!

D by D
August 30, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Poha Dosa : మ‌నం అటుకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అటుకుల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం చిరుతిళ్లనే కాకుండా అటుకుల‌తో మనం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎప్పుడూ ఒకేర‌కం దోశ‌లు తిని తిని బోర్ కొట్టిన వారు ఇలా అటుకుల దోశ‌ల‌ను ట్రై చేయ‌వ‌చ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ అటుకుల దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ పోహా దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బియ్యం – ఒక క‌ప్పు, అటుకులు – అర క‌ప్పు, మిన‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్స్, పెరుగు – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, ఉప్పు – కొద్దిగా, వంట‌సోడా- పావు స్పూన్.

Poha Dosa recipe in telugu make it like crispy
Poha Dosa

క్రిస్పీ పోహా దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని, అటుకుల‌ను, మిన‌ప‌ప్పును తీసుకుని శుభ్రంగాక‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 2 గంటల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండ‌లు లేకుండా చిలకాలి. త‌రువాత నీళ్లు పోసి మజ్జిగ‌లాగా చేసుకోవాలి. త‌రువాత నాన‌బెట్టిన బియ్యాన్ని మ‌ర‌లా మ‌జ్జిగ‌లో వేసి మ‌రో 3 గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మ‌జ్జిగ‌తో స‌హా జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిని రాత్రంతా పులియ‌బెట్టాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఇందులో ఉప్పు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.

పెనం వేడ‌య్యాక పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి. ఈ దోశ‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై నూనె వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే అటుకుల దోశ త‌యార‌వుతుంది. దీనిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా అటుకుల‌తో కూడా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ దోశ‌ల‌ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Poha Dosa
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sweet Samosa : స‌మోసాల‌ను తియ్య‌గా కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.