Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Restaurant Style Curd Rice : రెస్టారెంట్ల‌లో అందించే విధంగా క‌ర్డ్ రైస్‌ను ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోండి..!

D by D
September 12, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Restaurant Style Curd Rice : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌దార్థాల్లో క‌ర్డ్ రైస్ కూడా ఒక‌టి. క‌ర్డ్ రైస్ అన‌గానే చాలా మంది అన్నంలో పెరుగు వేసి క‌లప‌డం అని అనుకుంటారు. కానీ రెస్టారెంట్ ల‌లో ల‌భించే క‌ర్డ్ రైస్ చాలా మెత్త‌గా, క్రీమ్ లాగా ఉంటుంది. ఎంత తిన్నా తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఈ క‌ర్డ్ రైస్ ను అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. లంచ్ బాక్స్ లోకి, డిన్న‌ర్ లోకి ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ క‌ర్డ్ రైస్ ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రెస్టారెంట్ స్టైల్ క‌ర్డ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నాన‌బెట్టిన బియ్యం – అర క‌ప్పు, నీళ్లు – లీట‌ర్, పాలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, అల్లం త‌రుగు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, తియ్య‌టి పెరుగు – అర లీట‌ర్, క్రీమ్ – పావు క‌ప్పు.

Restaurant Style Curd Rice recipe in telugu very tasty how to make it
Restaurant Style Curd Rice

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, జీడిప‌ప్పు – 15.

రెస్టారెంట్ స్టైల్ క‌ర్డ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో బియ్యం, నీళ్లు , పాలు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై బియ్యం మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. అన్నం మెత్త‌గా అయిన త‌రువాత గంటెతో మ‌రింత మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం త‌రుగు, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని నీరంతా పోయే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఉడికించిన అన్నాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు, క్రీమ్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు ప‌దార్థాలు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని నూనెంత పోయే వ‌ర‌కు వ‌డ‌క‌ట్టాలి. త‌రువాత ఈ తాళింపులో స‌గం తాళింపు అన్నంలో వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ రైస్ ను ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్లగా అయిన త‌రువాత మిగిలిన తాళింపును పైన వేసుకుని అలాగే దానిమ్మ గింజ‌ల‌ను, క్యారెట్ తురుమును చ‌ల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌ర్డ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని ఒక్క స్పూన్ కూడా వ‌దిలిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Restaurant Style Curd Rice
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Jowar Palak Idli : జొన్న‌లు, పాల‌కూర‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఇడ్లీ.. త‌యారీ ఇలా..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.