Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chitti Pesarattu : కోన‌సీమ స్పెష‌ల్ చిట్టి పెస‌ర‌ట్టును ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

D by D
September 16, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chitti Pesarattu : మ‌న‌కు ఆంధ్రాలో ల‌భించే అల్పాహారాల్లో చిట్టి పెస‌ర‌ట్టు కూడా ఒక‌టి. పెస‌ర్ల‌తో చేసే ఈ చిట్టి పెస‌ర‌ట్టు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చిట్టి పెస‌ర‌ట్టును మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పొట్టు పెస‌ర‌ప‌ప్పు ఉంటే చాలు ఈ పెస‌ర‌ట్టును సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ చిట్టి పెస‌ర‌ట్టును ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చిట్టి పెస‌ర‌ట్టు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

పొట్టు పెస‌ర‌ప‌ప్పు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క్యారెట్ తురుము – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chitti Pesarattu recipe in telugu make like this
Chitti Pesarattu

ధ‌నియాల కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, మిన‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 5, కాశ్మీరి ఎండుమిర్చి – 5, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ధ‌నియాలు – అర క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, ఇంగువ – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఉప్పు – త‌గినంత‌.

చిట్టి పెస‌ర‌ట్టు త‌యారీ విధానం..

ముందుగా పెస‌ర‌ప‌ప్పును శుభ్రంగా క‌డిగి 3 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, మెంతులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, కాశ్మీరి మిర్చి, క‌రివేపాకు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింత‌పండు, ఇంగువ‌, ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు పోయేలా పెస‌ర‌ప‌ప్పును శుభ్రంగా క‌డుక్కోవాలి. త‌రువాత ఇందులో నుండి గుప్పెడు పెస‌ర‌ప‌ప్పును తీసి ప‌క్క‌కు ఉంచాలి. మిగిలిన ప‌ప్పును జార్ లో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొద్దిగా వంట‌సోడా వేసి క‌ల‌పాలి.

ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. త‌రువాత పిండిని తీసుకుని ఊత‌ప్పంలా వేసుకోవాలి. త‌రువాత దీనిపై ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లం తురుము, కొత్తిమీర‌, అలాగే కొద్దిగా పెస‌ర‌ప‌ప్పును కూడా వేసుకోవాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడిని చ‌ల్లుకోవాలి. త‌రువాత ఇవ‌న్నీ ఊడిపోకుండా గంటెతో వ‌త్తుకోవాలి. త‌రువాత నెయ్యి వేసి కాల్చుకోవాలి. పెస‌రట్టు ఒక వైపు వేగిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టి పెస‌ర‌ట్టు త‌యార‌వుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చిట్టి పెస‌ర‌ట్టును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chitti Pesarattu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Parwal Masala Curry : ఈ కూర‌గాయ‌ల‌తో చేసే మ‌సాలా కూర‌.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.