Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ullipaya Nilva Pachadi : ఉల్లిపాయ నిల్వ ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. వేడిగా అన్నంలో నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది..!

D by D
October 10, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ullipaya Nilva Pachadi : మ‌నం వంట‌ల్లో ఉల్లిపాయ‌ల‌ను విరివిగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయ‌లు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఇలా వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా, కారంగా ఉండే ఈ ఉల్లిపాయ నిల్వ ప‌చ్చ‌డిని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మెంతులు – ఒక టీ స్పూన్, జీల‌కర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు -ఒక టీ స్పూన్, నూనె – అర‌క‌ప్పు, సాంబార్ ఉల్లిపాయ – 500 గ్రా., ఎండుమిర్చి -4, ఇంగువ – పావు టీ స్పూన్, ప‌సుపు – ఒక టేబుల్ స్పూన్, కారం – 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్, చింత‌పండు ర‌సం – 150 ఎమ్ ఎల్.

Ullipaya Nilva Pachadi recipe in telugu very tasty with rice
Ullipaya Nilva Pachadi

ఉల్లిపాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మెంతులు, జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌లాయిలో అర క‌ప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక సాంబార్ ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. ఈ ఉల్లిపాయ‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా వేయించిన ఉల్లిపాయ‌ల నుండి 200 గ్రాముల ఉల్లిపాయ‌ల‌ను జార్ లో వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో మ‌రో అర క‌ప్పు నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌, ఇంగువ వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి.

దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిగిలిన ఉల్లిపాయ‌ల‌ను కూడా వేసిక‌ల‌పాలి. త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు ర‌సం వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ఆఫ్ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డి పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత గాజు సీసాలో వేసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Ullipaya Nilva Pachadi
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Fenugreek Seeds For Dandruff : మెంతులు, మందార ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. చుండ్రు అన్న‌ది అస‌లు ఉండ‌దు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.