Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Instant Biryani Gravy : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు దీన్ని చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

D by D
November 4, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Instant Biryani Gravy : మనం వంటింట్లో వివిధ ర‌కాల బిర్యానీల‌ను, పులావ్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని తిన‌డానికి మిర్చి కా సాల‌న్, ట‌మాట సాల‌న్ వంటి కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో క‌లిపి తింటే బిర్యానీ మ‌రింత రుచిగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఇలా మిర్చి కా సాల‌న్ వంటి వాటిని త‌యారు చేసే స‌మ‌యం ఉండ‌దు. అలాంట‌ప్పుడు కింద చెప్పిన విధంగా ఇన్ స్టాంట్ బిర్యానీ గ్రేవిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ గ్రేవీ కర్రీని 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బిర్యానీ, పులావ్, బ‌గారా అన్నం వంటి వాటితో తిన‌డానికి ఈ గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ గా బిర్యానీ గ్రేవి క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ స్టాంట్ బిర్యానీ గ్రేవీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నీళ్లు – ఒక క‌ప్పు, క‌సూరిమెంతి – ఒక టేబుల్ స్పూన్.

Instant Biryani Gravy recipe in telugu
Instant Biryani Gravy

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – 2 టీ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6 నుండి8, ట‌మాటాలు – 2, కొత్తిమీర – పావు క‌ప్పు, పుదీనా – 2 టీ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

ఇన్ స్టాంట్ బిర్యానీ గ్రేవీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ఎండుకొబ్బ‌రి ముక్క‌లు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, ధ‌నియాలు, గ‌స‌గ‌సాలు వేసి మెత్త‌ని పొడిలాగా చేసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత క‌సూరిమెంతి వేసి క‌లిపి మూత పెట్టాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ బిర్యానీ గ్రేవి త‌యార‌వుతుంది. ఈ విధంగా తయారు చేసిన గ్రేవీని బిర్యానీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Instant Biryani Gravy
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Chicken Samosa : చికెన్ స‌మోసా ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.