Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Garlic Soup : చ‌లికాలంలో ఇలా వేడి వేడిగా వెల్లుల్లి సూప్‌ను త‌యారు చేసి తాగండి.. ఎంతో బాగుంటుంది..!

D by D
November 15, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Garlic Soup : గార్లిక్ సూప్.. వెల్లుల్లితో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. చ‌లికాలంలో ఈ సూప్ ను తాగ‌డం వ‌ల్ల చ‌లి నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ సూప్ ను తాగ‌డం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ సూప్ ను తయారు చేయ‌డం చాలా సుల‌భం. ప‌ది నిమిషాల్లోనే ఈ సూప్ ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. గార్లిక్ సూప్ ను ఇంట్లోనే చాలా సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గార్లిక్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, నీళ్లు – అర గ్లాస్, నూనె – ఒక టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు- 6, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఉప్పు – తగినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా .

Garlic Soup recipe must take it in winter
Garlic Soup

గార్లిక్ సూప్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత దంచిన‌, క‌ట్ చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఒక‌టిన్న‌ర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ముందుగా క‌లిపిన కార్న్ ఫ్లోర్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, మిరియాల పొడి వేసి క‌లపాలి. త‌రువాత ఈ సూప్ ను మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు నిమిషాల పాటు మ‌రిగించిన త‌రువాత చిల్లీ ప్లేక్స్, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ సూప్ త‌యార‌వుతుంది. వేడి వేడి గా ఈ సూప్ ను తాగితే మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు మ‌నం ఈ సూప్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Garlic Soup
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Curd : రోజూ మధ్యాహ్నం భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.