Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

80 ఏళ్ల తండ్రికి, 45 ఏళ్ల కొడుక్కి మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌…

Admin by Admin
February 5, 2025
in Off Beat, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్ని చిన్నప్పుడు ఎంతో ముద్దు చేస్తూ గారాబంగా పెంచుతారు. త‌మ గుండెల‌పై ప‌సివారు తంతున్నా దాన్ని ఆనందంగా భ‌రిస్తూ వారికి న‌డ‌క, జ్ఞానం, మాట‌లు నేర్పిస్తారు. ఇక అప్పుడ‌ప్పుడే మాట‌లు వ‌చ్చి కొద్దిగా మాట్లాడే చిన్నారుల మెద‌ళ్ల‌లోనైతే బోలెడ‌న్ని ప్ర‌శ్న‌లు ఉంటాయి. త‌మ త‌ల్లిదండ్రుల‌కు రోజంతా ఆ ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తూ వాటికి స‌మాధానాలు రాబ‌డుతూనే ఉంటారు. అదేమిటి? ఇదేమిటి? అదెందుకు అలా ఉంది? ఇది ఇలా ఉందేమిటి? అంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేసి విసిగిస్తారు. అడిగిందాన్నే మ‌ళ్లీ మ‌ళ్లీ అడుగుతూ చిరాకు తెప్పిస్తారు. ఇది చూసే వారికి చిరాకేమో కానీ, త‌ల్లిదండ్రుల‌కు మాత్రం అలా ఎన్న‌టికీ అనిపించ‌దు. త‌మ పిల్ల‌లు ముద్దు ముద్దు మాట‌ల‌తో అడిగే ఎన్ని ప్ర‌శ్న‌ల‌కైనా, ఎన్ని సార్ల‌యినా వారు స‌మాధానం చెబుతారు.

ఈ క్ర‌మంలో ఆ పిల్ల‌లే పెరిగి పెద్ద‌వారైతే వృద్ధులైన త‌మ త‌ల్లిదండ్రుల‌ను అంత‌గా ప‌ట్టించుకోరు. వారితో మాట్లాడాలన్నా నిరాస‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఆ తండ్రీ కొడుకుల మ‌ధ్య కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఆ క‌థేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇది కేవ‌లం క‌ల్పిత క‌థ మాత్ర‌మే సుమా! ప్ర‌స్తుతం స‌మాజంలో ఉన్న‌ పోక‌డ‌ల‌ను ప్ర‌తిబింబిస్తూ తెర‌పైకి వ‌చ్చిన క‌థ ఇది. కాబ‌ట్టి అందులోని సారాంశాన్ని గ్ర‌హిస్తే చాలు. అంతా అర్థ‌మైపోతుంది. ఇంత‌కీ ఆ క‌థ ఏమిటంటే… ఓ 80 ఏళ్ల తండ్రి త‌న 45 ఏళ్ల కొడుకుతో క‌లిసి త‌మ ఇంట్లోని సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే ప‌క్క‌నే ఉన్న కిటికీ ఊచ‌ల‌పై ఓ కాకి వ‌చ్చి వాలింది. దాన్ని చూసిన ఆ తండ్రి ‘అదేమిటి?’ అని కాకిని చూపిస్తూ కొడుకును ప్ర‌శ్నించాడు. అందుకు ఆ కొడుకు అది ‘కాకి’ అని స‌మాధానమిచ్చాడు. మ‌రి కొద్ది నిమిషాల త‌రువాత…

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

a father and a son had an interesting conversation

అదే కాకిని చూపిస్తూ తండ్రి: అదేమిటి? అని అడిగాడు. కొడుకు: అది కాకి అని ఓపిగ్గా స‌మాధాన‌మిచ్చాడు. మ‌ళ్లీ కొంత సేప‌టికి తండ్రి: అదేమిటి? కొడుకు: అది కాకి (కోపం వ‌చ్చినా ఓపిగ్గానే చెప్పాడు). కొద్ది సేప‌టి త‌రువాత తండ్రి కొడుకుని మ‌ళ్లీ అదే ప్ర‌శ్న అడిగాడు. అప్పుడు కొడుకు బిగ్గ‌ర‌గా అరుస్తూ ‘నేను నీకు ఎన్ని సార్లు చెప్పాలి? నీకు తెలియ‌దా అది కాకి అని. అది ముమ్మాటికీ కాకే…’ అని పెద్ద‌గా మాట్లాడుతూ కోపంగా స‌మాధానం చెప్పాడు. అనంత‌రం తండ్రి త‌న గ‌దిలోకి వెళ్లి ఓ డైరీని తీసుకువ‌చ్చాడు. అది తన కొడుకు పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ తండ్రి రాసుకున్న డైరీ. అందులోని ఓ పేజీ చూపించి అక్క‌డ ఏం రాసి ఉందో ఆ తండ్రి త‌న కొడుకును చ‌ద‌వ‌మ‌ని అన్నాడు. అప్పుడు ఆ కొడుకు ఇలా చ‌దివాడు…

”ఈ రోజు నేను నా 3 ఏళ్ల ముద్దుల కొడుకు సోఫాలో కూర్చుని ఉండ‌గా అక్క‌డి కిటికీపై ఓ కాకి వ‌చ్చి వాలింది. అప్పుడు నా కుమారుడు దాన్ని చూసి ‘అదేమిటి?’ అని అడిగాడు. అది ‘కాకి’ అని నేను సమాధానమిచ్చాను. కానీ నా గారాల కొడుకు మాత్రం ‘అదేమిటి?’ అంటూ ఓ 23 సార్లు అడిగాడు. అయినా నాకు ఏమాత్రం కోపం రాలేదు. వాడి ముద్దు ముద్దు మాట‌లు చూసి ఎంతో ముచ్చ‌టేసింది. అందుకే ఎన్నిసార్లు అడిగినా నేను న‌వ్వుతూనే వాడికి అది ‘కాకి’ అని చెప్పాను. అనంత‌రం ద‌గ్గ‌రికి తీసుకుని ముద్దాడాను. నా ప‌సిపాప‌డి అమాయ‌క‌త్వాన్ని చూస్తే వాడిపై నాకు ఎంతో ప్రేమ‌, ఆప్యాయ‌త క‌లిగింది.”

ఇప్పుడు తెలిసిందా..! పైన మేం ఎందుకు అలా చెప్పామో..! అయితే మేం ముందే చెప్పాం క‌దా, ఇది కేవలం క‌థ మాత్ర‌మే అని. కాబ‌ట్టి సారాంశాన్ని మాత్ర‌మే గ్ర‌హించండి. అంతే చాలు!

Tags: fatherson
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sukanya Samriddhi Yojana : మీ కుమార్తె పేరిట డ‌బ్బును ఇలా పొదుపు చేస్తే ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే స‌రికి రూ.71 ల‌క్ష‌ల‌ను పొంద‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.