ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని నిమిషాల పాటు రన్నింగ్ చేయాలో తెలుసా ?
రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది తమ స్థోమత, సౌకర్యానికి అనుగుణంగా రోజూ వ్యాయామం చేస్తుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా చేసే వ్యాయామాల్లో రన్నింగ్ ఒకటి. దీని వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. రోజూ రన్నింగ్ చేయడం వల్ల అనేక రకాలుగా ఆరోగ్యంగా ఉంటాము. కండరాలు దృఢంగా మారుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె…