కడుపు నొప్పి నుంచి బయట పడాలంటే.. వీటిని తీసుకోవాలి..!
కడుపు నొప్పికి రకరకాల కారణాలున్నాయి. మలబద్దకం, గ్యాస్, లాక్టోజ్ సరిగ్గా జీర్ణం కాకపోవడం, డయేరియా, ఒత్తిడి మొదలగు అనేక కారణాలున్నాయి. ఐతే వీటన్నిటి నుండి విముక్తి పొంది కడుపునొప్పిని దూరం చేసుకోవచ్చు. అలా దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. మలబద్దకం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీనికి ప్రధాన కారణం పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోకపోవడమే. మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళూ ఎక్కువగా తాగకపోవడం,…