మీ పిల్లలకు ఆహారం తినిపిస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలను పాటించాల్సిందే..!
పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలుపట్టించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లలకు అన్నం పెట్టడానికి వాడే వస్తువుల విషయంలోనూ అంతే అప్రమత్తతతో వ్యవహరించాలి. అందుకే పిల్లల ఆహార వేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం. పిల్లలకి తినిపించడానికి ఉపయోగించే వస్తువులు అన్ బ్రేకబుల్ అయ్యుండాలి. ప్లాస్టిక్ వస్తువులైతే అందులో అన్నం పెట్టి తినిపించడం మంచిదో కాదో తెలుసుకోవాలి. మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే…