హాల్ లో సోఫా లో వదిన పక్కన మరిది కూర్చోవచ్చా.. కూడదా?

ఒక చిన్న పిట్టకథ: అనగనగా ఒక గురువు, శిష్యుడు కలిసి నడుస్తున్నారు, వారు ఒక నదిని దాటి అవతలి ఒడ్డు కి వెళ్ళాల్సి ఉంది.. ఈలోపల ఒక యువతి వచ్చి నదిని దాటేందుకు సహాయపడాల్సిందిగా వారిని కోరుతుంది.. సన్యాసులు కనుక గురు శిష్యులిద్దరూ పరస్త్రీ ని తాకరాదు.. ఈ విషయమై శిష్యుడు శషభిషలు పడుతుండగా, గురువు ఒక్క ఉదుటున ఆమెను భుజాన ఎత్తుకుని అవతలి ఒడ్డు కి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేస్తాడు.. గురువు గారు పరస్త్రీ ని … Read more

ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు ఆ కలర్ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

ప్రాణం పోసిన వాడు బ్రహ్మా అయితే.. మన ప్రాణాన్ని కాపాడేవాడు డాక్టర్‌. భూమిపైన ఉన్న జీవులకు వచ్చే, అనారోగ్యాలను తగ్గిస్తూ.. కాపాడేది వైద్యులు. అయితే.. ఈ డాక్టర్లు… ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళినప్పుడల్లా అతను ప్రత్యేకమైన నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు. అతని సహాయక సిబ్బంది కూడా అదే రంగు దుస్తులను ధరిస్తారు. అయితే..ఈ రంగు దుస్తులనే ఎందుకు వాడతారోననే డౌట్‌ ఎప్పుడైనా వచ్చిందా మీకు. అయితే.. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

ఆ పావురాల ముందు మనుషులు తలొంచుకోవాల్సిన సమయమిది!?

ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి . రంజాన్ పండుగ వచ్చింది . మసీదు ముస్తాబు అవుతున్నది . బూజు ,దుమ్ము దులిపేటప్పుడు పావురాల గుంపు అక్కడినుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి. గుడి అంతర్భాగం లో మకాం పెట్టాయి . ఇంతలో దసరా పండుగ వచ్చింది . ఆ అలంకరణలో మళ్ళీ పావురాలు ఎగిరిపోయి చర్చి లో కుదురుకున్నాయి . క్రిస్టమస్ వచ్చేసరికి మళ్ళీ మసీదుకి మారాయి .ఒకనాడు మసీదు ముందు మత … Read more

అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన చైనా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగక పోవడానికి గల కారణాలు ఏమిటి ?

ఇది భాషా సమస్య కాదు. వాళ్ళ భాష తెలిసినవాళ్ళే ప్రపంచంలో దాదాపు 90 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఇంకో 90 కోట్ల మందికి మండ‌రిన్ భాష నేర్పడం అసాధ్యం కాదు. కావాలంటే ఒక్క ఏడాదిన్నర వ్యవధిలోనే మాట్లాడే మండ‌రిన్ నేర్పొచ్చు. ఒక దేశం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందడం వేరు. సూపర్ పవర్ కావడం వేరు. దీనికి వేరే కోణాలు చాలా ఉన్నాయని గమనించాలి. అమెరికా తన సంపదని అన్ని దేశాల వారితోనూ పంచుకుంటుంది. చైనా … Read more

అమెరికా వెళ్లిన తెలుగు వారి జీవితం ఎలా ఉంటుంది..? హ్యాపీగా ఉంటారా..?

అమెరికాకు చట్టబద్ధమైన పద్దతిలో వెళ్లి అక్కడ సంపాదించి అక్కడే స్థిరపడాలని, వెళ్లిన వాళ్ళంతా అక్కడ సంతోషంగా వున్నారా ? మీరు దగ్గరగా చూసినవారి ఉదాంతాలు ఏమి చెబుతున్నాయి ? అంటే.. నాకు ఎవరితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా నేను అక్కడ ఉన్న నాలుగు నెలలు చూసినది. లోపల ఎంత టెన్షన్ ఉన్నాగాని భార్య భర్తలు ఇద్దరూ తయారై ఎవరి కారులో వాళ్లు డ్యూటీలకు వెళ్తారు. ఎప్పుడూ కారు ప్రయాణం ఒక అనుభూతి. డ్రైవింగ్ నేర్చుకోవటం కూడా చాలా … Read more

వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లు జంతువుల ఫోటోలు తీసేప్పుడు అవి దాడిచేయవా?

ఫోటోగ్రాఫర్ ఆతిఫ్ సయీద్ ఈ సింహాన్ని ఫోటో తీయబోతున్నప్పుడు అది దాడి చేసింది. ఆఫ్రికా వంటి దేశాల్లో సఫారిల్లో జంతువులకు మనుషుల ఉనికి అలవాటు చేస్తారు. అందుకని అవి పెద్దగా పట్టించుకోవు. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లు జంతువులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా మెలగటానికే ప్రయత్నిస్తారు కాబట్టి ఇలాంటి దాడులు చాలా అరుదు. వీరు వీలైనంత నిశ్శబ్దంగా పని చేస్తారు, ఇంకా కమొఫ్లాజ్ బట్టలు వేసుకోటం, కెమెరా లెన్స్‌కి కూడా అటువంటి కవర్లు వెయ్యటం చేస్తారు. ఏ జంతువును ఫోటో … Read more

ఇత‌ర గ్ర‌హాల‌పై ఉండే బంగారం, వ‌జ్రాల‌ను తవ్వి భూమి మీద‌కు తేవ‌చ్చు క‌దా..?

మనం అందరం కేజీఎఫ్ సినిమా చూసాము కదా, అందులో హీరో అంతులేని గని నుండి బంగారం తవ్వి తీస్తాడు. నిజానికి ప్రపంచంలో చాలా గనులు వెండి, బంగారం, ఉక్కు, ఇతర లోహాలు తవ్వేక్రమంలో ఒక ప్లాన్ వేసుకుని మాత్రమే తీస్తారు. ఎందుకంటే నాడా దొరికింది అని గుర్రం కొన్నట్లు ఉంటుంది సామెత. దానర్ధం మీ పెరట్లో ఒక బంగారు గని పడింది అనుకుందాం, అది తవ్వి తీయాలి అంటే రోజుకు 100 బుల్డోజర్లు, యాభై క్రేన్స్, 500 … Read more

లు లూ మాల్‌ అంతగా పాపులర్ అవ్వడానికి కారణం ఏంటి ?

ఈ మ‌ధ్య కాలంలో పాపుల‌ర్ అయిన మాల్స్‌లో లులు మాల్ కూడా ఒక‌టి. డిమార్ట్ ఎంత‌టి పేరు గాంచిందో ఈ మాల్ కూడా అంతే పేరుగాంచింది. ఇక్క‌డ వాహ‌నాన్ని పార్కింగ్ చేసేందుకే సుమారుగా 15 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. లులు మాల్ వ్యవస్థాపకుడు , దుబాయ్ లో స్థిరపడిన ఒక మలయాళీ వ్యాపారవేత్త.. అసలు ఆ భవనం, బయట ఏర్పాటు చేసిన హంగులు చూస్తేనే వావ్ అనిపిస్తుంది. ఒక్క హైదరాబాద్ మాల్ కోసం వారు పెట్టిన పెట్టుబడి … Read more

వాటర్‌ ట్యాంక్‌పై ఈ పైప్‌ ఎందుకు ఉంటుందో తెలుసా ?

మనకి వాటర్ ట్యాంక్స్ ఎంత అవసరమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లు కావాల్సి వచ్చినప్పుడల్లా బోరింగ్ పంపు కొట్టడం లేక బావి నుంచి తోడుకోవాల్సిన అవసరము లేకుండా చేయడం కోసం వాటర్ ను మోటర్ సాయంతో ట్యాంకులో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉంటున్నాం. అయితే వాటర్ ట్యాంకులను గమనిస్తే వాటిలో నీరు వెళ్లడానికి ఒక ఇన్ ఫ్లో, ట్యాంక్ నిండిన తర్వాత బయటకు రావడానికి ఒక అవుట్ ఫ్లో ఉంటుంది. వీటి … Read more

ముందు అత‌న్ని ప్రేమించింది.. స్పంద‌న లేద‌ని ఇంకో యువ‌కున్ని ప్రేమించి మోసపోయింది..!

అవి నేను ఇంట‌ర్ చ‌దువుతున్న రోజులు. అందులో బైపీసీ తీసుకున్నా. ఎలాగైనా నీట్ రాసి చ‌క్క‌ని ర్యాంక్ తెచ్చుకుని ఎంబీబీఎస్ చేయాల‌ని నాకు కోరికగా ఉండేది. అందుకోస‌మే క‌ష్ట‌ప‌డి చ‌దివేదాన్ని. అలా కాలేజీ రోజుల్లో నాకు చ‌ర‌ణ్ అని మా క్లాస్ మేట్ ఒక‌త‌ను ప‌రిచ‌యం అయ్యాడు. అత‌ను చాలా మంచి వ్య‌క్తి. చ‌దువుల్లో అత‌ను, నేను పోటీ ప‌డే వాళ్లం. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్ప‌డింది. బైపీసీ స‌బ్జెక్టుల్లో మాకు ఏవైనా డౌట్స్ వ‌స్తే ఇద్ద‌రం … Read more