వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ పుట్టింది 1943, అంటే 1993 కే 50 ఏళ్ళు నిండి నట్టు, 1993 నుంచి ఆయన సోలో హీరోగా పాత్రలు వేయడం మానేశారని చెప్పడం కరెక్ట్ కాదు, 50 సం. దాటిన తర్వాత కూడా కృష్ణ 50 కి పైగా చిత్రాలు హీరోగా చేశారు, వాటిలో కొన్ని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి, హీరోగా కృష్ణ కున్న క్రేజ్ కీ నిదర్శనంగా నిలి చాయి! ఒక టాప్ హీరో తనకు మార్కెట్ ఉన్నపుడు మరొకరితో కలిసి జంట హీరోగా వేయడం చాలా అరుదు, కథకు ఇద్దరు హీరోలు అవసరమైతే నిర్మాత, డైరెక్టర్ కోరిక మేరకు పాత్రలు వేయడం ఉంటుంది. ఎంతో ఉదారుడు, మంచి మనిషి అని పేరు తెచ్చుకున్న కృష్ణ చిత్రాలు చివరి సంవత్సరాలలో వరసగా ఫ్లాప్ అయ్యాయి, మానవుడు – దానవుడు, శాంతి సందేశం…ఇలా చాలా ఉన్నాయి, పైగా వీటికి ఆయనే దర్శకుడు లేదా నిర్మా త !

ఈ చిత్రాలన్నీ box office వద్ద బోల్తా పడటంతో కృష్ణ పాపం… భారీ అప్పుల్లో కూరుకు పోయి చివరికి అంతకు ముందు హిట్ అయిన సొంత చిత్రాల రైట్స్, పద్మాలయ స్టూడియో లీజుని జీ వారికి ఇచ్చి కొంత మేరకు బయట పడ్డారు. ఆయన తొలి సొంత చిత్రం అగ్ని పరీక్ష, దాని నిర్మాణానికి ఎంతో కష్ట పడ్డామని, సొంత ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టామని కృష్ణే స్వయంగా చెబుతుండే వారు, అగ్నిపరీక్ష మంచి హిట్ అయ్యింది, కృష్ణ, విజయనిర్మల జంటని ప్రేక్షకులు ఆదరించారు, అదే ఆసరాగా వారు చాలా చిత్రాల్లో కలిసి నటించారు, ఎంతో సంపద గడించారు, అయితే ఐదు దశాబ్దాల తరవాత పాపం కృష్ణ తన సొంత తొలి చిత్రం టైటిల్ లా ఆర్ధిక అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నారు.

how much krishna suffered losses

ఆ రోజుల్లో కృష్ణ ఇచ్చిన చెల్లని చెక్కుల్ని తోరణాలుగా కడితే హైదరాబాద్ నగరం సరిపోదని ఒక ప్రముఖ డైరెక్టర్ ప్రెస్ మీట్ లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు, ఇవన్నీ వాస్తవాలే! కోర్టుల్లో ఎన్నో చెక్ బౌన్స్ కేసులు పడ్డాయి. అదే రోజుల్లో దర్శకురాలు, నటి, నిర్మాత అయిన కృష్ణ భార్య విజయ నిర్మల ఆయన్ని ఆదుకుని ఆరోగ్య పరంగా సమస్యలు రాకుండా నగరానికి దూరంగా ఫాం హౌస్ కి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకున్నారు, కాబట్టి శక్తి, ఓపిక, సొంత ప్రతిభా పాటవాలు పై అతి విశ్వాసం కూడదని హీరో కృష్ణ జీవితం నుంచి ఎవరైనా గ్రహించాలి అనుకోవచ్చు. 2016 లో ఆఖరి చిత్రం…శ్రీ శ్రీ వరకూ కృష్ణ నటిస్తూనే ఉన్నారు , 16 చిత్రాలకు దర్శకత్వం చేశారు ! చనిపోయే నాటికి కృష్ణ కు పెద్దగా సొంత ఆస్తులు ఏమీ లేవు, పైగా పెద్ద కొడుకు అకాల మరణం, పెద్ద భార్య గతించడం వంటివి కుంగదీశాయి, కాకపోతే మహేష్ బాబు తన వారసుడిగా మరో సూపర్ స్టార్ గా ఎదగడం ఆయన్ని ఎంతో సంతోష పెట్టింది. కృష్ణ ఫిల్మ్ కెరీర్ కి, రజనీ కాంత్, చిరంజీవి కెరీర్ లకు పోలిక లేదు, వీరు సొంతంగా దర్శకత్వ విభాగంలో ప్రవేశించ లేదు, సొంతంగా పెట్టు బడి పెట్టీ రిస్కు తీసుకుని చిత్ర నిర్మాణ రంగంలోకి వెళ్ల లేదు, అదే తేడా!

Admin

Recent Posts