Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chakra Banalu : ర‌వ్వ‌తో ఎంతో రుచిగా ఉండే వీటిని చేసుకోండి.. నెల రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి..!

D by D
October 13, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chakra Banalu : మ‌నం ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో చ‌క్ర బాణాలు కూడా ఒక‌టి. చ‌క్ర బాణాలు చాలా రుచిగా, గుల్ల గుల్ల‌గా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే వీటిని చాలా సుల‌భంగా కేవ‌లం అర‌గంట‌లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రికి ఎంత‌గానో న‌చ్చే ఈ చ‌క్ర‌బాణాల‌ను రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌క్ర‌ బాణాల త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ర‌వ్వ – 2 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, చిల్లీ ప్లేక్స్ – 2 టీ స్పూన్స్, వాము – ఒక టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Chakra Banalu recipe in telugu you can store them 1 month
Chakra Banalu

చ‌క్ర‌ బాణాల త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ర‌వ్వ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, చిల్లీ ప్లేక్స్, వాము, త‌రిగిన క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. త‌రువాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ బాగా వ‌త్తుతూ పూరీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీని మూత పెట్టి పావు గంట పాటు ప‌క్కకు ఉంచాలి. త‌రువాత పిండిని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత చాకుతో ఈ చ‌పాతీని డైమండం ఆకారంలో చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఈ ముక్క‌ల‌ను తీసి నూనెలో వేసుకోవాలి. త‌రువాత వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే చ‌క్ర బాణాలు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా కాలం పాటు మెత్త‌బ‌డ‌కుండా తాజాగా ఉంటాయి. వీటిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

Tags: Chakra Banalu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Chana Chaat : సాయంత్రం స‌మ‌యంలో ఇలా శ‌న‌గ‌ల‌తో చాట్ చేసుకుని తినండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.