Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chettinad Tomato Chutney : చెట్టినాడ్ ట‌మాటా చ‌ట్నీ ఇలా చేయండి.. అన్నం, టిఫిన్స్‌లోకి ఎంతో బాగుంటుంది..!

D by D
December 15, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chettinad Tomato Chutney : చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీ.. చెట్టినాడ్ స్టైల్ లో చేసే ఈ ట‌మాట చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారాల‌తో తిన‌డానికి, చ‌పాతీ తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వెరైటీ రుచులు కావాల‌నుకునే వారు ఇలా చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే చ‌ట్నీ కావాలంటారు. ఎంతో రుచిగా, కారం, పుల్ల‌గా ఉండే ఈ చెట్టినాడ్ స్టైల్ ట‌మాట చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – పెద్ద‌ది ఒక‌టి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ఇంగువ – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన ట‌మాటాలు – 3, ఎండుమిర్చి – 7, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, చింత‌పండు – 2 టీ స్పూన్స్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం – కొద్దిగా.

Chettinad Tomato Chutney recipe in telugu very tasty with rice and tiffins
Chettinad Tomato Chutney

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె- 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, మిన‌ప‌ప్పు – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ఇంగువ‌, ఉప్పు, ట‌మాట ముక్క‌లు, ఎండుమిర్చి, కాశ్మీరి చిల్లీ కారం, చింత‌పండు, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి క‌ల‌పాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట చ‌ట్నీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, అల్పాహారాల‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ట‌మాట చ‌ట్నీని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఇష్టంగా తింటారు.

Tags: Chettinad Tomato Chutney
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Veins In Legs : కాళ్ల‌లో మీకు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే.. అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. చాలా ప్ర‌మాదం..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.