Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Palakura Chicken : పాల‌కూర చికెన్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటుంది..!

Editor by Editor
May 6, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Palakura Chicken : చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రతిసారీ ఒకే రకంగా తయారు చేసుకొని తినడంతో బోర్ కొడుతుంది. అలాంటప్పుడే కొద్దిగా వెరైటీగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పాలకూర చికెన్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే.

పాల‌కూర చికెన్ త‌యారీకి కావలసిన పదార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చికెన్ – 300 గ్రాములు, పాలకూర – 300 గ్రా, పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకులు – 4, లవంగాలు – 4, దాల్చినచెక్క – రెండు, నూనె – తగినంత, గరం మసాలా పొడి – ఒక స్పూన్, కారం పొడి – టేబుల్ స్పూన్, పసుపు – అర‌ టీస్పూన్‌, ఉల్లిపాయ ముక్కలు – ఒక క‌ప్పు.

Palakura Chicken recipe in telugu make in this method
Palakura Chicken

పాల‌కూర చికెన్‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా చికెన్ ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ లో పాలకూర, మిరపకాయలు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ తీసి కుక్కర్ మూత తీయాలి. ఈ విధంగా పాలకూర చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయ్యాక అందులోకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయాలి. అవి దోరగా వేగిన తర్వాత అందులోకి చికెన్ వేసి బాగా కలియబెట్టాలి.

ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ నూనెలో మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. అవసరమైతే చికెన్ ముక్కలు మెత్తగా కావడం కోసం కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పాలక్ మిశ్రమాన్ని అందులో వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన పాలకూర చికెన్ తయారైనట్టే. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులో అయినా తిన‌వ‌చ్చు. రుచిగా ఉంటుంది.

Tags: Palakura Chicken
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tomato Rasam : హోట‌ల్స్ లో చేసే లాంటి రుచితో ట‌మాటా ర‌సాన్ని ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.