చిట్కాలు

తిన్నది అరగడం లేదు గొంతులోకి వస్తుంది ఏం చెయ్యాలి?

ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఎప్పటినుంచో ఉంటే కచ్చితంగా గ్యాస్ట్రో ఎంట‌రాలజిస్ట్‌ని కన్సల్ట్ చెయ్యండి… మరీ ఎక్కువగా ఉన్నా అశ్రద్ధ చేయవద్దు…ఎందుకంటే అశ్రద్ధ చేసే కొద్దీ ఫుడ్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫుడ్ తో పాటు కొన్ని రకాల ఆసిడ్స్ కూడా ఫుడ్ తో పాటు మీ గొంతులోకి వచ్చే ప్రమాదం ఉంది దీని వలన…పేగులు ఆహారనాళం, గొంతు డామేజ్ అయ్యే అవకాశం ఉంది.. అలానే వదిలేస్తే…అదే ఓ పెద్ద ప్రమాదకరమైన వ్యాధిగా మారే అవకాశం ఉంది…ఒకవేళ అది నార్మల్ ప్రాబ్లమే అయితే…ఈ చిన్ని చిట్కా ఫాలో అవ్వండి…దీనివలన ఆహారం త్వరగా అరగడమే కాకుండా, ఉదర సంబంధిత వ్యాధులు చాలావరకు నయం అవుతాయి…

దానితోపాటు చాలాసార్లు మనం భోజనం చేయగానే బాగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది పొట్టనిండా తాగుతాము అయినా దాహంగా అనిపిస్తూనే ఉంటుంది అలాంటి కండిషన్ లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది… వాము (100g),. మిరియాలు (50g),ఉప్పు (రాక్ salt-25 g)… తీసుకోవాలి.

best and wonderful home remedy for gerd

వాము, మిరియాల‌ను దోరగా వేయించండి తక్కువ మంటపై ఇప్పుడు వాటికి సాల్ట్ క‌లిపి మెత్తగా మిక్సీ పట్టండి…ఓ గాజు సీసాలో పోయండి, స్టీల్ దాన్లో మాత్రం కచ్చితంగా పోయే వద్దు. ఇప్పుడు మీకు ఇబ్బంది అయినప్పుడల్లా (అంటే రోజుకు ఒకసారి) ఒక చెంచా మోతాదులో తీసుకొని గోరువెచ్చని నీటిలో కలిపి తాగేయడమే…టేస్ట్ కూడా బావుంటుంది.. కచ్చితంగా పని చేస్తుంది కూడా…

Admin

Recent Posts