inspiration

హృదయాన్ని కదిలించే కథ.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..!

ఒకతను ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు..! కొంతకాలం తర్వాత భార్యకు ఒక చర్మవ్యాధి వచ్చింది. రోజురోజుకీ అందం తగ్గిపోతోంది. ఆవిడ తనలో తానే ఆత్మన్యూనతకు(ఇన్ సెక్యూరిటి) లోనైంది, నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో, లేదో అనే సందేహం ఆమెని కుదురుగా ఉండనీయట్లేదు…! ఇంతలో ఒక రోజు భర్త ఒక టూర్ కి వెళ్ళి వస్తుండగా ఆక్సిడెంట్ కి గురై, అతని కళ్ళు పోయాయి…!! కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఇద్దరూ సంతోషంగా ఉండటానికే ఎప్పుడూ ప్రయత్నించే వారిరువురూ ఆనందంగానే ఉంటున్నారు..!

కళ్ళు కనపడని భర్తకు, చేదోడువాదోడుగా ఆమె ఉండసాగింది, కానీ ఏ రోజుకారోజు ఆమె వ్యాధి పెరిగి ఆమె అందం మచ్చుకైనా మిగల్లేదు..! చివరికి ఒక రోజు ఆమె చనిపోయింది..! అన్ని కార్యక్రమాలు విధిగా చేసిన భర్త వేరే ఊరికి ప్రయాణం అవుతున్నాడు.! తెలిసిన అతను ఒకరు అడిగారు, ఇన్ని రోజులూ నీ భార్య నీకు తోడుగా ఉంది కాబట్టి నీకు ఇబ్బంది లేకపోయింది, కళ్ళు కనపడని నువ్వు ఒంటరిగా కొత్తచోట ఎలా ఉండగలవూ అని..! అప్పుడు భర్త చెప్పాడు, నాకు ఆక్సిడెంట్ లో కళ్ళు పోలేదు, నా భార్య తన అనారోగ్యం వల్ల నాకు అందంగా కనపడకపోతే నేను నిరాశ పడతాననుకుని బాధ పడసాగింది, తన అనారోగ్యం కన్నా ఈ బాధే ఆమెను మరింత బాధ పెడుతోంది..!

small story about a caring husband whose wife dies

మాటలతో తన బాధను తీర్చలేననిపించింది. అనుకోకుండా జరిగిన ఆక్సిడెంట్ తో నా భార్య బాధకు పరిష్కారం నాకు ఈ విధంగా తోచింది..! అందుకే ఇన్ని రోజులూ నాకు కనపడనట్లే ఆమెతో ఉన్నాను. తను నాకు కళ్ళు కనపడవనే ఇబ్బందిని నేను పడకూడదనే తాపత్రయంలో తన బాధనే పట్టించుకోవటం మానేసింది.. ఇద్దరమూ ఒకరికోసం ఒకరం సంతోషంగా ఉన్నాము తను బతికినంత కాలం.. అని..! ఒకరి లోటుపాట్లను ఇంకొకరు చూసీచూడనట్లుగానో, తెలిసీతెలియనట్లుగానో వదిలెయ్యగలిగితే బంధాలు కలకాలం బావుంటాయి..!

Admin

Recent Posts