international

మనం ఎందుకు S400 రష్యా నుంచి కొనుక్కోవాలి? మనం తయారు చేసుకోలేమా?

సాంకేతికత విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముందుగా రాడార్ technology. మన దగ్గర ఉన్న ఆరుద్ర, అశ్వినీ రాడార్లు 200 – 300 km లోపు range మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ కుశ, మనం అభివృద్ధి చేస్తున్నాము, దాని range 350KM. ఒకేసారి, లక్ష్యాలను గుర్తించి, ఎంగేజ్ చేయడానికి high power, multi band systems ని integrate చేయడంలో ఇబ్బంది పడుతున్నాం. రష్యన్ S400 radar range 600 KM, మనం ఆ విషయంలో వెనుకబడి ఉన్నాము. S400 300 పైగా లక్ష్యాలను track చేయగలదు. అలా చేయడానికి gallium nitrite transceivers, signal processing సాంకేతికతలో ఇంకా మనం పరిపక్వత చెందాల్సి ఉంది.

S400 లో వాడే క్షిపణులు గంటకి 17000 KM వేగంతో వెళ్లగలవు, size పెరగకుండా 400 km దూరం , ఆ వేగం అందుకునేలా క్షిపణి తయారు చేయడం లో R&D ఇంకా అవసరం. ఆకాష్, barrack 8 systems 4–6 లక్ష్యాలను ఎంగేజ్ చేయగలిగితే, S 400 36 లక్ష్యాలను ఎంగేజ్ చేయగలదు. Multi missiles coordination software అభివృద్ధి చేయడంలో DRDO ఇంకా నైపుణ్యం సంపాదించాల్సి ఉంది. ఒకే సారి అనేకమైన డ్రోన్స్, క్షిపణులు దాడి చేస్తే వాటిని ఎలా prioritize చేసి , ఎంగేజ్ చేసే complex scenarios లో refinement అవసరం.

why we will not be able to make s400 systems

SAM systems మీద electronic warfare , jamming జరిగితే మన సంయుక్త EW system కల్పించే రక్షణ S400 స్థాయిలో లేదు. మెటలర్జీ , high energy propellant , dual pulse మోటార్ లు, ప్రొపల్షన్ ఇలా అనేకమైన సాంకేతికతల సమాహారమే S 400, చెప్పిన లిస్ట్ మొత్తం మనం వెనుకబడి ఉన్నాము. చైనా కూడా సరిగ్గా copy కొట్టలేకపోతోంది అంటే అవి ఎంత క్లిష్టమైనవో అర్థం చేసుకోవచ్చు. మనకి వినడానికి ఇబ్బంది కరమైన విషయం BEL, DRDO, BDL లాంటి సంస్థలు 70% ఎలక్ట్రానిక్స్ import చేసుకున్నవే ( seeker, chips లాంటి critical technology విష‌యంలో). కాబట్టి, లెర్నింగ్ curve చాలా ఉంది. R&D లో పెట్టుబడులు అవసరం.

Admin

Recent Posts