Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Oats Laddu : ఓట్స్ ల‌డ్డూల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Admin by Admin
March 24, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Oats Laddu : మ‌న‌కు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒక‌టి. ఇవి ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. అయితే వీటిని ఎలా త‌యారు చేసుకుని తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. వాస్త‌వానికి ఓట్స్ ను ఎలాగైనా తిన‌వ‌చ్చు. ఓట్స్‌తో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తింటే.. ఓవైపు పోష‌కాలు.. మ‌రోవైపు శ‌క్తి ల‌భిస్తాయి. దీంతోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. మ‌రి ఓట్స్‌తో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

Oats Laddu make them in healthy way recipe is here
Oats Laddu

ఓట్స్ ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ఓట్స్ – ఒక క‌ప్పు, బాదం ప‌ప్పు – ఒక క‌ప్పు, ఖ‌ర్జూరాలు – ఒక క‌ప్పు, కొబ్బ‌రి తురుము – కొద్దిగా, తేనె – 2 టీ స్పూన్లు.

ఓట్స్ ల‌డ్డూ త‌యారు చేసుకునే విధానం..

మొద‌ట‌గా ఓట్స్ ను లో పెనంపై 5 నిమిషాల పాటు వేయించాలి. బాదం పప్పును కూడా అదే విధంగా వేయించాలి. ఒక జార్ తీసుకుని అందులో ఓట్స్‌, బాదం ప‌ప్పు వేసి మెత్త‌గా పిండి చేసుకోవాలి. త‌రువాత ఖ‌ర్జూరాల‌ను కూడా జార్ లో వేసి తురుములా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసిన ఓట్స్, బాదం ప‌ప్పు మిశ్ర‌మంలో ఖ‌ర్జూరాల తురుము, తేనే వేసి బాగా క‌లుపుకోవాలి. చేతుల‌కు నెయ్యిని రాసుకుంటూ ఈ మిశ్ర‌మాన్ని ల‌డ్డూలా చేసి కొబ్బ‌రి తురుముతో గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన ఓట్స్ ల‌డ్డూల‌ను ఒక వారం పాటు నిల్వ చేసుకోవ‌చ్చు. అధిక బ‌రువును త‌గ్గ‌డంలో ఓట్స్ ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల బాదం, ఖ‌ర్జూరాల‌లో ఉండే పోష‌కాలు శ‌రీరానికి అందుతాయి.

ఓట్స్ ల‌డ్డూల‌ను ఈ విధంగా త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల ఎన్నో పోష‌కాలు, శ‌క్తి ల‌భిస్తాయి. అలాగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా పొంద‌వ‌చ్చు. వీటి త‌యారీలో ఉప‌యోగించేవి అన్నీ స‌హ‌జ‌సిద్ధ‌మైన‌వే క‌నుక ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండ‌దు. ఈ విధంగా ఓట్స్‌ను తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: Oats Ladduఓట్స్ ల‌డ్డూ
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

IPL 2022 : చెన్నై కెప్టెన్‌గా ధోనీ త‌ప్పుకోవ‌డం వెనుక ఉన్న కార‌ణం అదే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.