వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఈ ట్రెండ్ బాలీవుడ్లో ఎక్కువగా ఉండేది.. కానీ ఇది టాలీవుడ్ లోకీ కూడా వచ్చింది.. మరి తెలుగు ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. నందమూరి తారక రామారావు 20 సంవత్సరాల వయసులోనే మేనమామ కూతురు బసవతారకంని పెళ్లి చేసుకున్నారు. 1985లో అనారోగ్యం వల్ల బసవతారకం మృతి చెందింది. ఎన్టీఆర్ మళ్లీ 1993లో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి వివాహం సీతాదేవిని చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా రెండో వివాహం శ్యామలాదేవిని చేసుకున్నారు.

కమల్ హాసన్ కూడా మొదటగా వాణిగణపతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సారికను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ సంతానంగా శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. నాగార్జున మొదటి వివాహం లక్ష్మీ దగ్గుబాటిని చేసుకున్నారు. విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి నాగార్జున అమల రెండో వివాహం చేసుకున్నారు. ప్రకాష్ రాజు ముందుగా లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. దీని తర్వాత విడిపోయి ఆయన పోలీస్ శర్మ ను వివాహం చేసుకున్నారు.

these actors married more than 2 times

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి వివాహం నందినిని చేసుకున్నారు. కొంతకాలానికి విడిపోయి 2005 లో రేణు దేశాయ్ వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. మళ్లీ ఆమెతో విడిపోయి రష్యా నటీ అన్నా లెజినీవాను వివాహమాడారు.

Admin

Recent Posts