హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం. భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని అంటున్నారు. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? దేవాలయాలకు వెళ్ళినప్పుడో, లేదా ఇంట్లో వ్రతాలు కానీ, పూజలు కానీ జరిగినప్పుడు గురువులకు, దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు.
సాస్టాంగ నమస్కారంను పురుషులు చేస్తే సరి, మహిళలను ఎందుకు చెయ్యనివ్వరు? సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి. సాష్టాంగ నమస్కారం.. స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి చేయునది ఇలా పురుషులు చేయవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయ్యటం వల్ల గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుదనే మన వారి ధర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు.
ఇంకా చెయ్యాలనుకుంటే నడుం వంచి ప్రార్థించవచ్చు. ఇలా శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి ఈ సూచన చేయబడింది. అది పాటించడం వల్ల స్త్రీల ఆరోగ్యానికి మేలు జరగుతుంది. స్త్రీలు నమస్కరించుకోవాలనుకొన్నప్పుడు పంచాగ నమస్కారాన్ని అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే తాకేలా నమస్కరించుకోవడం మంచిది.