గుండె బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాలు ఇవే..!
గుండెకు బలమైన ఆహారాలు సాధారణంగా హాస్పిటల్స్ లో గుండె జబ్బుల రోగులకు సూచిస్తారు. అయితే ఈ ఆహారాన్ని మీ ఆరోగ్యకర ఆహార ప్రణాళికలో కూడా చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో చాలావరకు ఆరోగ్యకరమైనవి, పోషకాలు బాగా కలిగిన ఆహారాలు మాత్రమే వుంటాయి. గుండెకు బలమైన ఆహారంలో పండ్లు, పచ్చటి కూరలు, తృణధాన్యాలు, పీచు పదార్ధాలు వుంటాయి. కొవ్వు, సోడియం, కొల్లెస్టరాల్, కేఫైన్ వంటి గుండె జబ్బులు కలిగించే పదార్ధాలు తక్కువగా వుంటాయి. సాధారణంగా గుండె జబ్బు రోగులు ఎప్పటికపుడు…