Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Brahmanandam : బ్ర‌హ్మానందం గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఆశ్చర్య‌పోవ‌డం ఖాయం..!

Admin by Admin
January 23, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Brahmanandam : హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సినిమాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మెప్పు పొందారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కారు బ్ర‌హ్మానందం. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కామెడీకి నిలువెత్తు నిదర్శనం అయిన బ్ర‌హ్మానందం.. అత్తిలిలో లెక్చ‌ర‌ర్ గా కెరీర్ ప్రారంభించారు. దాదాపు తొమ్మిదేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొన‌సాగిన బ్ర‌హ్మానందం.. `శ్రీ తాతావతారం` సినిమాతో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు. ఈ చిత్రంతో నట‌నా జీవితాన్ని ప్రారంభించిన కూడా తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన `అహ! నా పెళ్ళంట!`.

ఈ సినిమాతో బ్ర‌హ్మానందంకి మంచి గుర్తింపు రాగా, ఆ త‌ర్వాత ఆయ‌నకి ఎన్నో సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి.స్టార్ హీరోలు సైతం అత‌ని డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది హాస్యన‌టులు వ‌చ్చినా.. బ్రహ్మానందం స్థానాన్ని బ‌ర్తీ చేయ‌లేక‌పోయారు. బ్ర‌హ్మానందం కామెడీతో హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. బ్ర‌హ్మానందం తండ్రి పేరు క‌న్నెగంటి నాగా లింగ చారి కాగా, త‌ల్లిపేరు ల‌క్ష్మీ న‌ర్స‌మ్మ‌. బ్ర‌హ్మానందం దంప‌తుల‌కి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు.. సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ప్రస్తుతం అక్కడే ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యాడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

Brahmanandam net worth family and other details

నాలుగు ద‌శాబ్దాల సినీ కెరీర్ లో బ్ర‌హ్మానందం 1200 పైగా సినిమాల్లో నటించారు బ్ర‌హ్మానందంం. ఈ క్ర‌మంలోనే ఆస్తుల‌ను కూడా భారీగా కూడ‌బెట్టారు. బ్రహ్మానందం ఒక్కో కాల్టీటుకు రూ. లక్ష చార్జ్ చేస్తున్నారు. ఒక సినిమాకే ఆయ‌న రూ. కోటి వరకు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. పాత్ర‌కు ఉన్న వెయిటేజ్ ను బ‌ట్టీ ఆయ‌న పారితోషికాన్ని తీసుకునేవారు. చాలా వ‌ర‌కు బ్ర‌హ్మానందం త‌న ఆస్తిని ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేశారు. ఇక ఆయన స్థిర, చరాస్థులు అన్ని కలిపితే రూ. 600 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. కాగా, బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్ ఉన్నారు.

Tags: Brahmanandam
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఆ ఆసనాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు…!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.