Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Carrot Aloo Fry : క్యారెట్‌, ఆలూ ఫ్రై త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

D by D
May 17, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Carrot Aloo Fry : మ‌నం వంటింట్లో కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి ర‌కర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి రెండు, మూడు కూర‌గాయ‌ల‌ను క‌లిపి ఒకే కూర‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌తో కూర చేయ‌డానికి సాధ్య‌ప‌డ‌దు. కొన్ని ర‌కాల కూర‌గాయ‌లు మాత్ర‌మే ఇలా చేయ‌డానికి వీలుగా ఉంటాయి. ఈ విధంగా చేయ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో క్యారెట్స్, ఆలుగ‌డ్డ‌లు కూడా ఉన్నాయి. ఇవి రెండు కూడా మ‌న శ‌రీరానికి మేలు చేసేవే. మ‌నం క్యారెట్ ల‌ను, ఆలుగ‌డ్డ‌ల‌ను వేరువేరుగా ఫ్రై చేస్తూ ఉంటాం. వేరువేరుగా కాకుండా వీటిని క‌లిపి కూడా ఫ్రై చేయ‌వ‌చ్చు. ఇలా చేసిన ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది, క్యారెట్, ఆలూ ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Carrot Aloo Fry make in this way for better taste
Carrot Aloo Fry

క్యారెట్ ఆలూ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చిన్న‌గా తరిగిన క్యారెట్స్ – 4, చిన్న‌గా త‌రిగిన బంగాళా దుంప – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, ప‌సుపు – అర టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి పొడి – ఒక టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – అర టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల కారం – 2 టేబుల్ స్పూన్స్.

క్యారెట్ ఆలూ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత జీల‌క‌ర్ర, ఆవాలు, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత త‌రిగిన ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ‌లు, క‌రివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు త‌రిగిన క్యారెట్, బంగాళాదుంప, ప‌సుపు, ఉప్పు వేసి బాగా క‌లిపి మూత పెట్టి చిన్న మంటపై వేయించుకోవాలి. క్యారెట్, బంగాళాదుంప పూర్తిగా ఉడికిన త‌రువాత ఎండు కొబ్బరి పొడి, పుట్నాల కారం, ధ‌నియాల పొడి వేసి క‌లిపి మ‌రో 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఆలూ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా క్యారెట్, ఆలూ రెండింటినీ తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: Carrot Aloo Fry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Mint Leaves : ఉద‌యాన్నే మ‌జ్జిగ‌లో పుదీనా ఆకుల ర‌సం క‌లిపి తాగితే.. ఏం జ‌రుగుతుందంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.