Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Alu Gobi Masala Curry : ఆలూ గోబీ మ‌సాలా క‌ర్రీ.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

D by D
May 30, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Alu Gobi Masala Curry : మ‌నం వంటింట్లో బంగాళాదుంప‌ల‌తో, కాలీఫ్ల‌వ‌ర్ తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటితో వేరువేరుగానే కాకుండా వీటిని క‌లిపి కూడా మ‌నం వంట‌ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. చాలా మంది బంగాళాదుంప‌ల‌ను, కాలీఫ్ల‌వ‌ర్ ను క‌లిపి వంట‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా బంగాళాదుంప‌ల‌ను, కాలీఫ్ల‌వ‌ర్ ను క‌లిపి మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ గోబీ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చిన్న‌గా త‌రిగిన బంగాళాదుంప ముక్క‌లు – 2 క‌ప్పులు, చిన్న‌గా త‌రిగిన కాలీఫ్ల‌వ‌ర్ ముక్క‌లు – 2 క‌ప్పులు, ట‌మాట పేస్ట్ – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Alu Gobi Masala Curry very easy to make it is delicious
Alu Gobi Masala Curry

ఆలూ గోబీ మ‌సాలా క‌ర్రీ త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోనే కాలీఫ్ల‌వ‌ర్ ముక్క‌లను కూడా వేసి క‌లిపి మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో నూనె వేసి చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లను, ప‌చ్చి మిర్చి ముక్క‌లను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. ఇప్పుడు ట‌మాట పేస్ట్ ను వేసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించుకోవాలి.

త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌లిపి నీళ్ల‌ను పోసి ఉడికించాలి. నీళ్లు బాగా వేడ‌య్యాక ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్క‌ల‌ను, కాలీఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి క‌లిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ముక్క‌లు పూర్తిగా ఉడికిన త‌రువాత గ‌రం మ‌సాలాను వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అలూ గోబీ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా బంగాళాదుంపలు, కాలీఫ్ల‌వ‌ర్ ల‌ను తిన‌డం వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను, వాటిలో ఉండే పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: Alu Gobi Masala Curry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Palakova : పాలు విరిగిపోయాయా.. ఏం ఫ‌ర్లేదు.. ఎంతో రుచిక‌ర‌మైన కోవాను ఇలా త‌యారు చేయండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.