Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Poori Kura : పూరీల‌లోకి కూర‌ను ఇలా త‌యారు చేయండి.. భ‌లే రుచిగా ఉంటుంది..!

D by D
June 13, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Poori Kura : మనం ఉద‌యం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ పూరీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌ను తిన‌డానికి చేసే కూర బాగుంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. ఈ కూర‌ను మ‌నం శ‌న‌గ‌పిండిని ఉప‌యోగించి త‌యారు చేస్తూ ఉంటాం. అయితే శ‌న‌గ‌పిండికి బ‌దులుగా పుట్నాల పొడిని వేసి కూడా మనం పూరీ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసే పూరీ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. పుట్నాల పొడిని వేసి పూరీ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పూరీ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండు మిర‌ప‌కాయ‌లు – 2, క‌రివేపాకు – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 5 లేదా రుచికి త‌గిన‌న్ని, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయలు – 2 (పెద్ద‌వి), చిన్న‌గా త‌రిగిన బంగాళాదుంప – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – త‌గిన‌న్ని, పుట్నాల ప‌ప్పు – పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Poori Kura will be very tasty. make in this way.
Poori Kura

పూరీ కూర త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత ఆవాల‌ను, ఎండు మిర్చిని, క‌రివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత త‌రిగిన ప‌చ్చి మిర్చిని, ఉల్లిపాయ‌ల‌ను, బంగాళాదుంప‌ను, ప‌సుపును, ఉప్పును వేసి క‌లిపి అవి మునిగే వ‌ర‌కు నీళ్ల‌ను పోసి మూత పెట్టి బంగాళాదుంప ముక్క‌లు ఉడికే వ‌ర‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో పుట్నాల ప‌ప్పును వేసి మెత్త‌గా పొడి చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పొడిలో త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని బంగాళాదుంప ముక్క‌లు ఉడికిన త‌రువాత అందులో వేసి క‌లిపి మ‌ధ్య‌స్థ మంట‌పై 2 నిమిషాల పాటు ఉడికించి చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ కూర త‌యార‌వుతుంది. త‌ర‌చూ శ‌న‌గ‌పిండిని వేసి చేసే పూరీ కూర‌కు బ‌దులుగా ఇలా పుట్నాల పొడిని వేసి చేసే పూరీ కూర కూడా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన పూరీ కూర‌తో పూరీల‌ను క‌లిపి తిన‌డం వ‌ల్ల చాలా రుచిగా ఉంటాయి.

Tags: Poori Kura
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tomato Pickle : ట‌మాటా నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.