Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

దేశంలో ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతున్న ఎన్‌440కే క‌రోనా వైర‌స్‌.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సీసీఎంబీ వార్నింగ్‌..

Admin by Admin
February 24, 2021
in హెల్త్ న్యూస్
0
Share on FacebookShare on Twitter

క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డం, నిత్యం న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య భారీగా ప‌డిపోవ‌డంతో.. క‌రోనా ఇక లేద‌ని, అంతం అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో గ‌త వారం, ప‌ది రోజుల నుంచి నిత్యం న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో క‌రోనా సెకండ్ వేవ్ వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

coronavirus mutated strain n440k spreading rapidly in india alert for south states by ccmb scientists

You might also like

కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

December 11, 2024

షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువ‌గా కేర‌ళ‌వాసుల‌కే వ‌స్తున్నాయ‌ట‌..!

December 9, 2024

కాగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టికే మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌ల‌ను విధించారు. ప‌లు జిల్లాలు, న‌గ‌రాల్లో రాత్రి పూట క‌ర్ఫ్యూను విధించారు. రాత్రిపూట క‌ఠిన‌మైన లాక్ డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. ఇక పెరుగుతున్న క‌రోనా కేసులు ఆందోళ‌న‌కు గురి చేస్తుంటే మ‌రోవైపు సీసీఎంబీ శాస్త్ర‌వేత్త‌లు షాకింగ్ న్యూస్ చెప్పారు. దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌కు గాను 7వేల‌కు పైగా ఉత్ప‌రివ‌ర్త‌నాలు (మ్యుటేష‌న్స్‌) ఉన్నాయ‌ని చెప్పారు. అంటే క‌రోనా 7వేల ర‌కాలుగా మార్పుల‌కు గురైన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇది ప్ర‌స్తుతం సైంటిస్టులను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

ఇక స‌ద‌రు 7వేల మ్యుటేషన్ల‌లో కొన్ని మ్యుటేష‌న్లు తీవ్ర‌మైన ఇబ్బందుల‌ను క‌లిగించే అవకాశం ఉంటుంద‌ని సైంటిస్టులు తెలిపారు. వాటిల్లో 5వేల ర‌కాల‌కు చెందిన క‌రోనా వైర‌స్‌ల‌పై సైంటిస్టులు స‌మ‌గ్రంగా ప‌రిశీల‌న చేశారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా ఏవిధంగా మార్పు చెందింది.. అనే వివ‌రాల‌ను సీసీఎంబీ సైంటిస్టులు అధ్య‌యనం చేశారు. వాటితో కూడిన ప‌రిశోధ‌నా ప‌త్రాల‌ను వారు ప్ర‌చురించారు.

కాగా స‌ద‌రు 7వేల ఉత్ప‌రివ‌ర్త‌నాల్లో ఎన్‌440కే అనే పేరున్న క‌రోనా వైర‌స్ ర‌కం మ‌న దేశంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు. ముఖ్యంగా ఎన్‌440కే ర‌కం క‌రోనా వైర‌స్ ద‌క్షిణ భార‌త దేశంలోని రాష్ట్రాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని సీసీఎంబీ డైరెక్ట‌ర్ రాకేష్ మిశ్రా తెలియ‌జేశారు.

ఇక ప్ర‌తి వైర‌స్ మ్యుటేష‌న్‌ను కొత్త వైర‌స్‌గా చెప్ప‌లేమ‌ని, కానీ వైర‌స్‌ల‌కు సంబంధించి జన్యు స‌మాచారాన్ని క‌నుక్కోవ‌డంలో ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్ కాస్తంత వెనుక‌బ‌డే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చ‌ని అన్నారు. కాగా దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారుగా 1 కోటి క‌రోనా కేసుల్లో 6400 వ‌ర‌కు జీనోమ్‌ల‌ను క‌నుక్కున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఎన్‌440కే ర‌కం క‌రోనా వైర‌స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందేన‌ని, క‌రోనా పూర్తిగా అంత‌మైంద‌ని అప్పుడే భావించ‌వ‌ద్ద‌ని అన్నారు. ఇక ప్ర‌స్తుతం దేశంలో అనేక న‌గ‌రాల్లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో సెకండ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉంద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వాలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తేనే క‌రోనా నియంత్ర‌ణ సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు.

Tags: ccmbccmb scientistscoronaviruscovid 19covid strainmutated strainn440kn440k virusఎన్‌440కేఎన్‌440కే వైర‌స్‌క‌రోనా ఉత్ప‌రివ‌ర్త‌నంక‌రోనా వైర‌స్‌కోవిడ్ 19కోవిడ్ స్ట్రెయిన్‌సీసీఎంబీసీసీఎంబీ సైంటిస్టులు
Admin

Admin

Related Stories

కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

by Admin
December 11, 2024
0

క‌రోనా అనంత‌రం చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా ఉన్న‌వారు కూడా అప్ప‌టిక‌ప్పుడు కుప్ప‌కూలి హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్‌తో చ‌నిపోతున్నారు....

షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువ‌గా కేర‌ళ‌వాసుల‌కే వ‌స్తున్నాయ‌ట‌..!

by Admin
December 9, 2024
0

మ‌న దేశంలో అక్ష‌రాస్య‌త శాతంలోనే కాదు, ఆరోగ్య‌ప‌రంగానూ కేర‌ళ మొద‌టి స్థానంలో ఉంది. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇప్పుడు ఆ రాష్ట్రం జీవ‌న‌శైలి (లైఫ్ స్టైల్‌) వ్యాధులు అధికంగా...

ఈ మెడిసిన్ల‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

by Sam
October 30, 2024
0

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నాయి. దేశంలో నకిలీ,నాసిర‌కం మందులు విచ్చ‌ల‌విడిగా చెల‌మాణి అవుతున్నాయి. పారాసిటమాల్‌ మాత్రల నుంచి...

+-

by Sam
October 7, 2024
0

Next Post

వీటిని నెల రోజుల పాటు తీసుకోండి.. షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.