Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Kara Boondi : కారం బూందీని ఇలా చేస్తే రుచిగా క‌ర‌క‌ర‌లాడుతుంటుంది..!

D by D
June 25, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Kara Boondi : మ‌నం వంటింట్లో శ‌న‌గ పిండిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల చిరు తిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ పిండితో చేసే అన్ని ర‌కాల చిరు తిళ్లు చాలా రుచిగా ఉంటాయి. శ‌న‌గ పిండిని ఉప‌యోగించి చేసే చిరు తిళ్ల‌ల్లో కారం బూందీ కూడా ఒక‌టి. కారం బూందీని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఈ కారం బూందీ మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతుంది. దీనిని ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రికి ఎంత ప్ర‌య‌త్నించినా కారం బూందీ క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోవ‌డం రాదు. బ‌య‌ట దొరికే విధంగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే విధంగా కారం బూందీని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కారం బూందీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

శ‌న‌గ పిండి – ఒక క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, వేడి చేసిన నూనె – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – గుప్పెడు, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 3, కారం – 1 టీ స్పూన్.

Kara Boondi make in this way for perfect taste
Kara Boondi

కారం బూందీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ పిండిని, ప‌సుపును, కొద్దిగా, వేడి చేసిన నూనెను వేసి త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసుకుంటూ మ‌రీ ప‌లుచ‌గా కాకుండా పిండిని క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత జ‌ల్లి గిన్నెను లేదా జ‌ల్లి గంటెను లేదా చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకుని దానిలో పిండిని తీసుకుంటూ చేత్తో కానీ గంటెతో కానీ పిండి నూనెలో ప‌డేలా రుద్దాలి. ఇప్పుడు బూందీని గంటెతో క‌దిలిస్తూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండి అంతా అయిపోయే వ‌ర‌కు కాల్చుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ప‌ల్లీల‌ను, క‌రివేపాకును కూడా వేసి క‌రివేపాకు క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించి బూందీలో వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను కూడా వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే కారం బూందీ త‌యార‌వుతుంది. దీనిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. బ‌య‌ట దొరికే చిరు తిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా కారం బూందీని త‌యారు చేసి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఎప్పుడు పడితే అప్పుడు తిన‌వ‌చ్చు.

Tags: Kara Boondi
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sweet Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.