Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Kadai Mushroom : పుట్ట‌గొడుగుల‌తో.. క‌డాయి మ‌ష్రూమ్ క‌ర్రీ.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..

D by D
August 3, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Kadai Mushroom : మ‌న‌కు కాలానుగుణంగా దొరికే వాటిల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి. ఒక‌ప్పుడు ఇవి మ‌న‌కు కేవ‌లం వ‌ర్షాకాలంలో మాత్ర‌మే దొరికేవి. కానీ ప్ర‌స్తుత కాలంలో ఇవి ఏడాది పొడ‌వునా లభ్య‌మ‌వుతున్నాయి. పుట్ట గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల మన శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, పీచు ప‌దార్థాల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా పుట్ట గొడుగుల్లో అధికంగా ఉంటాయి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటాం. అందులో భాగంగా రెస్టారెంట్ స్టైల్ క‌డాయి మ‌ష్రూమ్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రెస్టారెంట్ స్టైల్ క‌డాయి మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

త‌రిగిన పుట్ట గొడుగులు – 200 గ్రా., నూనె – రెండున్న‌ర‌ టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు ప‌లుకులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, అల్లం – ఒక ఇంచు ముక్క‌, పెద్ద‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాట – 1, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, మిరియాలు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 2 (చిన్నవి), ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, పెట‌ల్స్ లా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – 10, పెట‌ల్స్ లా త‌రిగిన క్యాప్సికం ముక్క‌లు – 10, ఉప్పు – త‌గినంత‌, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – రెండు, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

make Kadai Mushroom here is the recipe
Kadai Mushroom

రెస్టారెంట్ స్టైల్ క‌డాయి మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, ఎండు మిర్చి, మిరియాలు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు వేసి దోర‌గా వేయించుకోవాలి. త‌రువాత వీట‌న్నింటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన త‌రువాత జీడిప‌ప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం ముక్కలు, పెద్ద‌గా త‌రిగిన ఉల్లిపాయ‌, ట‌మాట వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిపై మూత ఉంచి ట‌మాట ముక్క‌లు పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి.

త‌రువాత వీటిని కూడా ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా పేస్ట్ లా చేసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో అర టేటుల్ స్పూన్ నూనె వేసి పెటల్స్ లా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌ల‌ను, క్యాప్సికం ముక్క‌ల‌ను, పుట్ట గొడుగు ముక్క‌ల‌ను వేసి క‌లిపి మూత పెట్టాలి. పుట్ట గొడుగులల్లో ఉండే నీరు అంతా పోయి అవి పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉంచి వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత సాజీరా, ప‌చ్చి మిర్చి, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని, అర క‌ప్పు నీళ్ల‌ను పోసి క‌లిపి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడిని, ప‌సుపును, ఉప్పును వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత వేయించిన పుట్ట గొడుగు ముక్క‌ల‌ను వేసి క‌లపాలి. త‌రువాత ఒక క‌ప్పు నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టాలి. వీటిని 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క‌డాయి మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా దీన్ని తిన‌డం వ‌ల్ల పుట్ట గొడుగుల్లో ఉండే పోషకాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా చేసిన క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Kadai Mushroom
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Electricity Bill : క‌రెంటు బిల్లు అధికంగా వ‌స్తుందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. బిల్లు స‌గానికి స‌గం త‌గ్గుతుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.