Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ginger Pickle : అల్లం ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..!

D by D
August 17, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ginger Pickle : మ‌న వంటింట్లో త‌ప్పకుండా ఉండాల్సిన వాటిల్లో అల్లం కూడా ఒక‌టి. అల్లంలో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. మ‌న‌కు వ‌చ్చే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారి నుండి కాపాడ‌డంలో అల్లం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. వంటల్లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా అల్లంతో ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారుచేసుకోవ‌చ్చు. అల్లంతో నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

అల్లం – 150 గ్రా., ఎండు మిర‌ప‌కాయ‌లు – 8 లేదా త‌గిన‌న్ని, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, నీళ్లు – 200 ఎంఎల్, చింత‌పండు – 100 గ్రా., నూనె – 100 ఎంఎల్, ఆవాలు – ఒక‌టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఎండు మిర్చి – 2, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, ఇంగువ – అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, బెల్లం తురుము – 100 గ్రా., ఉప్పు – 3 టీ స్పూన్స్ లేదా త‌గినంత‌.

here it is how to make Ginger Pickle
Ginger Pickle

అల్లం నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా అల్లాన్ని శుభ్రం చేసి ముక్క‌లుగా కోసి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి నీళ్లు కాగిన త‌రువాత శుభ్రం చేసుకున్న చింత‌పండును వేసి మెత్త‌గా అయ్యి ద‌గ్గ‌ర‌ప‌డే వ‌ర‌కు ఉడికించి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక క‌ళాయిలో ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ధ‌నియాల‌ను వేసి చిన్న మంట‌పై ఎక్కువ సేపు వేయించుకోవాలి. త‌రువాత మెంతుల‌ను కూడా వేసి వేయించి చ‌ల్ల‌గా అయిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. వీటిని మెత్త‌గా పొడిలా అయ్యే వ‌ర‌కు మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన త‌రువాత అల్లం ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి.

అల్లం ముక్క‌లు బాగా వేగిన త‌రువాత వాటిని ఒక జార్ లోకి తీసుకుని వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులోనే ఉడికించిన చింత‌పండును కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో మిగిలిన నూనె పోసి నూనె కాగిన త‌రువాత‌ ఆవాలు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండు మిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. త‌రువాత ఇంగువ‌ను, ప‌సుపును వేసి క‌ల‌పాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న అల్లం మిశ్ర‌మాన్ని వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ధ‌నియాల మిశ్ర‌మాన్ని వేసి క‌లుపుకోవాలి.

త‌రువాత బెల్లం తురుమును అలాగే ఒక టేబుల్ స్పూన్ నీళ్ల‌ను వేసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా క‌రిగిపోయిన త‌రువాత త‌గినంత ఉప్పును వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌చ్చ‌డి నుండి నూనె బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసే అల్లం నిల్వ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డి పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ఒక గాజు సీసాలో గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డంవ‌ల్ల ఆరు నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. దీనిని అన్నంతోపాటు అల్పాహారాల‌తో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు. అల్లంతో ఈ విధంగా ప‌చ్చ‌డిని చేసుకుని తిన‌డం వ‌ల్ల కూడా అల్లం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: Ginger Pickle
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Biyyam Java : జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. దీన్ని తీసుకోవాలి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.