Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sweet Corn Soup : ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌నిస‌రిగా స్వీట్ కార్న్ సూప్‌ను తాగాలి.. త‌యారు చేయ‌డం సుల‌భ‌మే..!

D by D
August 29, 2022
in ఆహారం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sweet Corn Soup : వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు లేదా జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వేడి వేడిగా ఏదైనా సూప్ ను తాగాల‌నిపించ‌డం స‌హ‌జం. అలాంట‌ప్పుడు మ‌నం ఎక్కువ‌గా బ‌య‌ట దొరికే సూప్ ప్యాకెట్ల‌ను తెచ్చుకుని త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. కానీ అవి అంత రుచిగా ఉండ‌వు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా మ‌నం ఇంట్లోనే చాలా రుచిగా సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. అచ్చం రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా ఉండే స్వీట్ కార్న్ సూప్ ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

స్వీట్ కార్న్ – పావు క‌ప్పు కంటే కొద్దిగా ఎక్కువ‌, నీళ్లు – ముప్పావు లీట‌ర్, వెన్న – అర టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 3, చిన్న‌గా త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెనిగ‌ర్ – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, పంచ‌దార – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్.

Sweet Corn Soup we must take this in this season know how to make it
Sweet Corn Soup

స్వీట్ కార్న్ సూప్ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో స్వీట్ కార్న్ గింజ‌ల‌ను, పావు క‌ప్పు నీళ్ల‌ను తీసుకోవాలి. వీటిని వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా కలుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో వెన్న‌ను వేసి వేడి చేయాలి. వెన్న క‌రిగిన త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. త‌రువాత క్యారెట్ ముక్క‌ల‌ను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

త‌రువాత మ‌రో 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ గింజ‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముప్పావు లీట‌ర్ నీటిని పోయాలి. నీరు పోసిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్ర‌మాన్ని వేసి క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఉడికించే కొద్ది పైన తేట‌లాగా ఏర్ప‌డుతుంది. ఈ తేట‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు గంటెతో తొల‌గించాలి. త‌రువాత చిల్లీ సాస్, వెనిగ‌ర్, మిరియాల పొడి, పంచ‌దార వేసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని వేసి క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చిక్క‌బ‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత పైన మ‌రికొన్ని స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రుచిగా ఉండే స్వీట్ కార్న్ సూప్ త‌యారవుతుంది. జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటివి బాధిస్తున్న‌ప్పుడు ఇలా త‌యారు చేసుకున్న స్వీట్ కార్న్ సూప్ ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Tags: Sweet Corn Soup
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Snake Bite Home Remedies : పాము కాటుకు గురైన వారిని ప్రాణాపాయం నుంచి త‌ప్పించే చిట్కాలు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.