Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Bilva Patra : ఈ ఆకుల‌తో పూజిస్తే.. శివుని అనుగ్ర‌హం త‌ప్ప‌క క‌లుగుతుంది..!

D by D
October 25, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Bilva Patra : బిళ్వ చెట్టు.. దీనిని మారేడు, వెల‌గ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈచెట్టు మ‌హా శివునికి చాలా ఇష్టం. మారేడు ద‌ళాలు లేకుండా శివార్చ‌న లేదు. భార‌తీయుల‌కు మారేడు చెట్టు ఎంతో ప‌విత్ర‌మైన‌ది. దీని గురించి వేద‌కాలం నుండి తెలుసు. దేవాల‌యాల్లో ఇది ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. మారేడు ఆకులు మూడు క‌లిసి శివుని క‌ళ్ల‌లా ఉంటాయి. శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడ‌ని ప్ర‌తీతి. శివున్ని బిళ్వ ప‌త్రాల‌తో పూజించ‌డం శ్రేష్టం. బిళ్వ వృక్షం శివున్ని స్వ‌రూప‌మ‌ని సాక్షాత్తూ దేవ‌త‌లు భావిస్తారు. శివ పురాణంలో బిళ్వ ప‌త్రం విశిష్ట‌త తెలిపే క‌థ ఉంది.

ఒక‌నాడు శ‌నిదేవుడు శివున్ని ద‌ర్శించ‌డానికి కైలాసానికి ఏగి పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌రుల‌ను ద‌ర్శించి భ‌క్తితో స్తుతించాడు. అంత‌ట శివ దేవుడు శ‌నిదేవున్ని విధి ద‌ర్మ‌మును ప‌రీక్షించ నెప‌మునా నీవు న‌న్ను ప‌ట్ట‌గ‌ల‌వా అని ప్ర‌శ్నించాడు. అందుకు శని మ‌రునాటి సూర్యోద‌యం నుండి సూర్యాస్త‌మ‌యం వ‌ర‌కు శివున్ని ప‌ట్టి ఉంచ‌గ‌ల‌న‌ని తెలిపాడు. దానితో శివుడు మ‌రునాటి సూర్యోద‌యం స‌మ‌యంలో బిళ్వ వృక్షం రూపం దాల్చి ఆ వృక్ష‌ము నుందు నివ‌సించాడు. మ‌హేశ్వ‌రునిజాడ తెలియ‌క పార్వతీ దేవితో స‌హా దేవ‌తలంద‌రూ ముల్లోకాల‌ను గాలించారు. వారికి శివుడి జాడ కానీ శ‌ని దేవుడి జాడ కానీ తెలియ‌రాలేదు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Bilva Patra do puja with these leaves lord shiva will give blessings
Bilva Patra

సూర్యాస్త‌మ‌యం త‌రువాత బిళ్వ వృక్షం నుండి శివుడు సాకార రూపంగా బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మ‌రుక్ష‌ణ‌మే శ‌ని దేవుడు అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. న‌న్ను ప‌ట్టుకోలేక పోయావే అని శివుడు ప్ర‌శ్నించ‌గా శ‌ని దేవుడు న‌వ్వి నేను ప‌ట్ట‌డం వ‌ల్ల‌నే క‌దా లోకారాధ్యులు త‌మ‌రు ఈ బిళ్వ వృక్షంలో దాగి ఉన్న‌ది అని అన్నాడు. శ‌నిదేవుడి విధి నిర్వ‌హ‌ణకు భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌కు మెచ్చిన శివుడు ఈశ్వ‌రుడైనా న‌న్నే కొద్ది కాలం ప‌ట్టి నా యందే నువ్వు వ‌సించి ఉండ‌డం చేత నాటి నుండి నువ్వు శ‌నీశ్వ‌రుడు పేరుతో ప్ర‌సిద్ది నొంద‌గ‌ల‌వు అని వ‌ర‌మిచ్చాడు.

అంత‌ట శ‌నిదోషం ఉన్న‌వారు ఈ దోష‌ప‌రిహారార్ధం త‌న‌ను బిళ్వ ప‌త్రాల‌తో పూజిస్తే దోష నివార‌ణ జ‌రుగుతుంద‌ని కూడా చెప్పాడు. బిళ్వ ప‌త్రాల‌తో పూజించే వారిని శ‌ని దేవుడు బాధించ‌డు అని అభ‌య‌మిచ్చాడు. ల‌క్ష్మీ దేవి త‌ప‌స్సు వ‌ల్ల బిళ్వ వృక్షం పుట్టింది. ల‌క్ష్మీ దేవిని బిళ్వ నిల‌య అని కూడా పిలుస్తారు. బ్ర‌హ్మ వ‌ర్చ‌స్సు పొంద‌డానికి సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిళ్వ కొయ్య‌ను అశ్వ‌మేధ యాగంలో ఇలాంటి బిళ్వ రూపాల‌ను ఆరింటిని ప్ర‌తిష్టించారు. బిళ్వ ప‌త్రాన్ని సోమ‌వారం, మంగ‌ళ వారం, ఆరుద్ర న‌క్ష‌త్రం, సంధ్యాస‌మ‌యం, రాత్రివేళందు, శివ‌రాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగ‌ల స‌మ‌యాన కోయ‌కూడ‌దు.

Tags: Bilva Patra
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Vankaya Perugu Kura : వంకాయ పెరుగు కూర.. ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.