Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Prawns Pulao : రొయ్యల పులావ్‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది.. మొత్తం తినేస్తారు..

Editor by Editor
October 30, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Prawns Pulao : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఏదో ఒక నాన్‌వెజ్‌ వంటకాన్ని వండుకుని తింటుంటారు. చికెన్‌, మటన్‌, చేపలు.. ఇలా రకరకాల మాంసాహారాలను తింటారు. అయితే ప్రాన్స్‌.. రొయ్యలను కూడా ఎక్కువగానే తింటారు. ఇవి ధర ఎక్కువ అన్నమాటే కానీ.. ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. అనేక మినరల్స్‌ వీటిలో ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మన శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ఇక రొయ్యలతోనూ రకరకాల వంటలు చేయవచ్చు. వాటిల్లో పులావ్‌ కూడా ఒకటి. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే రొయ్యల పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రొయ్యల పులావ్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

రొయ్యలు – రెండు కప్పులు, పసుపు – అర టీస్పూన్‌, బాస్మతి బియ్యం – రెండు కప్పులు, నూనె – పావు కప్పు, దాల్చిన చెక్క – చిన్న ముక్క, యాలకులు, లవంగాలు – 5 చొప్పున, బిర్యానీ ఆకులు – రెండు, జీలకర్ర – ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ, టమాటా – ఒక్కోటి చొప్పున, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్‌, టమాటా ప్యూరీ – ఒక టేబుల్‌ స్పూన్‌, కారం, గరం మసాలా – ఒక టీస్పూన్‌ చొప్పున, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు, ఉప్పు – తగినంత, చక్కెర – చిటికెడు, కరివేపాకు రెబ్బలు – రెండు, పచ్చి మిర్చి – రెండు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, నిమ్మరసం – రెండు టీస్పూన్లు.

Prawns Pulao make in this style tastes good recipe
Prawns Pulao

రొయ్యల పులావ్‌ను తయారు చేసే విధానం..

శుభ్రం చేసిన రొయ్యలపై పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బాస్మతి బియ్యం తీసుకుని సరిపడా నీళ్లు పోసి పొడి పొడిగా వండుకుని పక్కన ఉంచాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టాలి. అది వేడయ్యాక నూనో వేసి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, జీలకర్ర వేయించాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తరువాత టమాటా ప్యూరీ, గరం మసాలా, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రొయ్యల్ని వేసుకోవాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు కరివేపాకు, నిమ్మరసం, అన్నం వేసి బాగా వేయించాలి. 5 నిమిషాలు అయ్యాక కొత్తిమీర తరుగు వేసి దించాలి. అంతే.. రుచికరమైన రొయ్యల పులావ్‌ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా రైతా, మిర్చి కా సాలన్‌తోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.

Tags: Prawns Pulao
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tomato Juice : రోజూ బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్.. బీపీ, హార్ట్ ఎటాక్‌, షుగ‌ర్‌.. అన్నింటికీ చెక్‌..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.