Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఔష‌ధ విలువ‌లు గ‌ల వేప ఆకులు.. ఏయే అనారోగ్యాల‌కు ప‌నిచేస్తాయంటే..?

Admin by Admin
August 21, 2021
in ఆరోగ్యం, చిట్కాలు
0
Share on FacebookShare on Twitter

ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కాదు కానీ గ్రామాల్లో మ‌న‌కు దాదాపుగా ఎక్క‌డ చూసినా వేప చెట్లు క‌నిపిస్తాయి. ఎండాకాలంలో వేప చెట్లు మ‌న‌కు నీడ‌నిస్తాయి. చ‌ల్ల‌ని నీడ కింద సేద‌తీరుతారు. అయితే వేప చెట్టు ఆకులు ఎన్నో విలువైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. వేప ఆకుల‌ను ఆయుర్వేద వైద్యంలో ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు. వేప ఆకుల‌తో పొడి త‌యారు చేసుకుని దాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

ఔష‌ధ విలువ‌లు గ‌ల వేప ఆకులు.. ఏయే అనారోగ్యాల‌కు ప‌నిచేస్తాయంటే..?

You might also like

మునగాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

July 20, 2025

ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..

July 20, 2025

కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని 2 రోజుల పాటు ఆకుల నుండి తేమ ఎండిపోయే వరకు నీడ‌లో ఎండ‌బెట్టాలి. త‌రువాత ఆకులు పెళుసుగా మార‌గానే వాటిని పొడి చేయాలి. ఆ పొడిని గాలి చొరబడని సీసాలో భ‌ద్ర‌ప‌రుచుకోవాలి. ఆ పొడిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వేప ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అనేక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

1. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే చిటికెడు వేపాకుల పొడిని తీసుకుంటే శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌లు ఉండ‌వు. శ‌రీరంలో పిత్త‌, క‌ఫ దోషాలు స‌మ‌తుల్యం అవుతాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌శిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఔష‌ధ విలువ‌లు గ‌ల వేప ఆకులు.. ఏయే అనారోగ్యాల‌కు ప‌నిచేస్తాయంటే..?

2. వేప పొడి, కొద్దిగా నీటిని క‌లిపి పేస్ట్‌లా చేసి గాయాలు, పుండ్ల‌పై రాసి క‌ట్టు క‌డుతుంటాలి. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి.

3. వేప ఆకుల పొడిని లేదా వేపాకుల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉన్న‌వారు రోజుకు రెండు పూట‌లా ఈ పొడిని తీసుకుంటే మంచిది.

4. వేపాకుల పొడి, నీటిని కొద్దిగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకుని ముఖానికి రాయాలి. కొద్ది సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.

ఔష‌ధ విలువ‌లు గ‌ల వేప ఆకులు.. ఏయే అనారోగ్యాల‌కు ప‌నిచేస్తాయంటే..?

5. స్నానం చేసే నీటిలో కొద్దిగా వేపాకుల పొడి లేదా వేపాకుల గుజ్జు (పేస్ట్‌)ను వేసి ఆ నీటితో స్నానం చేయాలి. వారంలో 2, 3 సార్లు ఇలా చేస్తే చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. గ‌జ్జి, తామ‌ర వంటివి ఉండ‌వు. చ‌ర్మం ఎప్పుడూ దుర‌ద‌గా ఉండేవారు ఇలా చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

6. వేపాకుల పొడి, నిమ్మ‌ర‌సంల‌ను కొద్దిగా తీసుకుని క‌లిపి మిశ్ర‌మంలా చేయాలి. దాన్ని జుట్టుకు రాయాలి. కుద‌ళ్ల‌కు త‌గిలేలా మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత 20 నిమిషాలు ఆగి త‌ల‌స్నానం చేయాలి. దీంతో జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వెంట్రుక‌లు రాల‌డం ఆగుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు త‌గ్గుతుంది. జుట్టు కుదుళ్ల వ‌ద్ద ఉండే ఇన్‌ఫెక్షన్లు త‌గ్గుతాయి. శిరోజాలు ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తాయి.

7. వేపాకుల పొడిలో కొద్దిగా నీటిని క‌లిపి మిశ్ర‌మంలా చేసి దాంతో దంతాల‌ను తోముకోవాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోట్లో బాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లో, నాలుక‌పై ఉండే పొక్కులు త‌గ్గుతాయి.

ఔష‌ధ విలువ‌లు గ‌ల వేప ఆకులు.. ఏయే అనారోగ్యాల‌కు ప‌నిచేస్తాయంటే..?

8. రోజూ వేపాకుల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. శ‌రీరంలో ర‌క్త‌స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

9. వేపాకుల‌ను కొద్దిగా వేడి చేసి కీళ్లు, పాదాల‌పై ప‌ట్టీలా వేసి క‌ట్టు క‌ట్టాలి. దీంతో నొప్పులు త‌గ్గుతాయి.

10. కీట‌కాలు, దోమ‌లు వంటివి కుట్టిన‌ప్పుడు చ‌ర్మంపై దద్దుర్లు వ‌చ్చి దుర‌ద‌, నొప్పి క‌లుగుతుంటే ఆ భాగాల‌పై వేపాకులను గుజ్జుగా చేసి రాయాలి. దీంతో నొప్పి, దుర‌ద త‌గ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: health problemsneemNeem Leavesneem leaves powderఅనారోగ్య స‌మ‌స్య‌లువేపవేపాకుల పొడివేపాకులు
Admin

Admin

Related Stories

మునగాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

by Admin
July 20, 2025
0

ప్రకృతిలో ఉచితంగా లభించే మునగాకులో, మనం డబ్బులు పెట్టి కొనుక్కొనే ఏ ఒక్క ఆకు, కూరగాయలలో లేనటువంటి ఔషధ గుణాలు చాలా వున్నాయట. వాటిల్లో కొన్ని మీ...

ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..

by Admin
July 20, 2025
0

ఒక వ్యక్తిని చూడగానే ఆకట్టుకోవాలంటే అందమైన, ఒత్తైన జుట్టు కూడా ఉండాలి. జుట్టు రాలిపోయినా.. తగ్గిపోయినా వయసు అయిపోయినట్లే కనిపిస్తుంది. అనేకమంది వేలకు వేలు రూపాయలు పోసి...

2 రూపాయల విలువైన ఈ ఒక్క వస్తువు వల్ల మీ దంతక్షయం నశిస్తుంది..!

by Admin
July 20, 2025
0

నేడు, చాలా మందికి దంతాలలో పుండ్లు ఏర్పడతున్నాయి. ఫలితంగా, వారి దంతాలు క్షీణిస్తున్నాయి. గుట్కా, పొగాకు తినడం వల్ల చాలా మందికి పుండ్లు వస్తాయి. దీని కారణంగా,...

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

by Admin
July 13, 2025
0

దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల శరీరంలో అనేక ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. మలబద్ధక సమస్య క్రమంగా పైల్స్‌కు దారితీస్తుంది. దీన్ని నివారించాలంటే మీ ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం...

Next Post

చిన్నారుల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.