Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

మీ నాలుక ఏ రంగులో ఉంది ? ఆ రంగును బ‌ట్టి మీ ఆరోగ్య స్థితి గురించి ఇలా తెలుసుకోండి..!

Admin by Admin
July 14, 2021
in వైద్య విజ్ఞానం
0
Share on FacebookShare on Twitter

డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు స‌హ‌జంగానే వారు మ‌న క‌ళ్లు, గోర్లు, నాలుక‌ల‌ను ప‌రిశీలించి మ‌న ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. ఆయా భాగాల్లో వ‌చ్చే మార్పులు, అవి క‌నిపించే రంగుల‌ను బ‌ట్టి వారు రోగి స్థితి గ‌తుల‌ను అంచ‌నా వేస్తుంటారు. అందుకు అనుగుణంగా వారు రోగుల‌కు చికిత్స చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్ట‌ర్లు నాలుక‌ను చూసే చాలా విష‌యాలు తెలుసుకుంటారు. నాలుక ఉన్న రంగును బ‌ట్టి మ‌న‌కు ఏయే అనారోగ్య స‌మస్య‌లు ఉన్నాయో మ‌నం కూడా ఇట్టే సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

identify the diseases you have according to your tongue color

You might also like

గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో తెలుసా..?

July 28, 2025

డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లో అర్ధం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా.? 3 కారణాలు ఇవే.!

July 25, 2025

1. నాలుక లైట్ పింక్ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నార‌ని అర్థం. దానిపై కొద్దిగా తెల్ల‌ని కోటింగ్ ఉన్నా ఏమీ కాదు. నార్మ‌ల్‌గానే ఉన్నారని అర్థం చేసుకోవాలి.

2. నాలుక తెలుపు రంగులో ఉంటే నోట్లో శుభ్రంగా లేద‌ని, నోటి శుభ్ర‌త‌ను పాటించ‌డం లేద‌ని అర్థం. శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురైనా నాలుక ఇలాగే క‌నిపిస‌స్తుంది. కొన్నిసార్లు ఫ్లూ ఉన్నా ఇలాగే నాలుక క‌నిపిస్తుంది.

3. మీ నాలుక ప‌సుపు రంగులో క‌నిపిస్తుందంటే మీ శ‌రీరంలో పోష‌కాల లోపం ఉంద‌ని అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా ప‌రీక్ష‌లు చేయంచుకుని చికిత్స‌లు తీసుకోవాలి. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేకున్నా, లివ‌ర్‌, జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు ఉన్నా అలా నాలుక ప‌సుపు రంగులో క‌నిపిస్తుంది. ఆయా స‌మ‌స్య‌ల వ‌ల్లే నాలుక‌పై ప‌సుపు రంగు కోటింగ్ ఏర్ప‌డుతుంది.

4. నాలుక బ్రౌన్ క‌ల‌ర్ లో ఉందంటే.. మీరు కెఫీన్ ఎక్కువ‌గా ఉండే కాఫీ, టీల‌ను ఎక్కువ‌గా తాగుతున్నార‌ని అర్థం. లేదా పొగ తాగినా అలాగే నాలుక బ్రౌన్ రంగులో క‌నిపిస్తుంది.

5. నాలుక న‌లుపు రంగులో ఉందంటే మీరు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. చెయిన్ స్మోక‌ర్ల నాలుక అలాగే న‌లుపు రంగులో ఉంటుంది. క్యాన్స‌ర్‌, అల్స‌ర్‌, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్నా, నోట్లో శుభ్ర‌త పాటించ‌క‌పోయినా, నాలుక‌పై బాక్టీరియా పేరుకుపోయినా అలా నాలుక న‌లుపు రంగులో క‌నిపిస్తుంది.

6. నాలుక మ‌రీ ఎరుపు రంగులో క‌నిపిస్తుందంటే శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లేదా విట‌మిన్ బి12 లోపించింద‌ని అర్థం చేసుకోవాలి. దీంతో ఆయా పోష‌కాలు ఉండే ఆహారాలు లేదా సప్లిమెంట్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.

7. నాలుక నీలం లేదా ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉందంటే.. అందుకు కార‌ణం గుండె స‌మ‌స్య‌లు అయి ఉండ‌వ‌చ్చు. గుండె త‌గినంత ర‌క్తాన్ని లేదా ఆక్సిజ‌న్‌ను పంప్ చేయ‌లేక‌పోతుంటే అలా నాలుక ఆ రంగుల్లో క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలో వెంట‌నే అల‌ర్ట్ అయి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స‌ను తీసుకోవాలి. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: diseasestonguetongue colorనాలుకనాలుక రంగువ్యాధులు
Admin

Admin

Related Stories

గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో తెలుసా..?

by Admin
July 28, 2025
0

గోర్లు కొర‌క‌డం చాలా మందికి ఉండే అల‌వాటు. చిన్నారులే కాదు, కొంద‌రు పెద్దలు కూడా గోర్ల‌ను ప‌దే ప‌దే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్ల‌ను కొర‌క‌డ‌మ‌నేది చాలా...

డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లో అర్ధం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా.? 3 కారణాలు ఇవే.!

by Admin
July 25, 2025
0

సుస్తీ చేస్తే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం, ల‌క్ష‌ణాలు చెప్ప‌డం, ఆరోగ్య ప‌రిస్థితిని వివ‌రించ‌డం, ఆయ‌న ఇచ్చిన చిట్టీ ప‌ట్టుకుని మందులు కొన‌డం, మింగడం… ఇదీ అనారోగ్యం బారిన...

ఏ వ‌యస్సులో ఉన్న‌వారికి ఎంత నిద్ర అవ‌స‌రం అంటే..?

by Admin
July 25, 2025
0

నిద్ర బంగారం. ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదీనూ. ఇది కొరవడకుండా చూసుకుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. మున్ముందు జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. చురుకుదనం, పనుల్లో సామర్థ్యం ఇనుమడిస్తుంది....

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

by Admin
July 23, 2025
0

శరీరానికి కావాల్సిన శక్తి చక్కగా అందాలంటే.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని భావిస్తాం...

Next Post

వ‌ర్షాకాలంలో ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా మీ కళ్ల‌ను ఇలా సుర‌క్షితంగా ఉంచుకోండి.. అందుకు ఈ సూచ‌న‌లు పాటించండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.