Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Veg Rolls : రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ రోల్స్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

D by D
August 31, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Veg Rolls : వెజ్ చ‌పాతీ రోల్స్.. గోధుమ‌పిండి అలాగే కూర‌గాయ‌లు క‌లిపి చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఈ రోల్స్ చాలా చ‌క్క‌గా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు వెజ్ రోల్స్ ను త‌యారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ వెజ్ చ‌పాతీ రోల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ చ‌పాతీ రోల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – 3 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు -ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన క్యాప్సికం – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, గోధుమ‌పిండి – 2 క‌ప్పులు, ట‌మాట సాస్ – 2 టీ స్పూన్స్.

Veg Rolls recipe in telugu make them in restaurant style
Veg Rolls

వెజ్ చ‌పాతీ రోల్స్ త‌యారీ విధానం..

ముందుగా గోధుమ‌పిండిలో త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత పిండిపై మూత పెట్టి ప‌క్కకు ఉంచాలి. తరువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌కర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట‌, క్యారెట్, బంగాళాదుంప‌, క్యాప్సికం వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క‌లిపిన పిండిని ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చపాతీలా వ‌త్తుకోవాలి.

త‌రువాత దీనిపై నూనె, పొడి పిండి చ‌ల్లుకుని మ‌డ‌త పెట్టాలి. ఈ మ‌డ‌త పెట్టిన త‌రువాత‌ మ‌ర‌లా పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా వ‌త్తుకోవాలి. ఈ చ‌పాతీని వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. చ‌పాతీ కొద్దిగా కాలిన త‌రువాత నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్ని చ‌పాతీలను త‌యారు చేసుకున్న త‌రువాత వాటిపై ట‌మాట సాస్ ను రాసుకోవాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న కూర‌ను మ‌ధ్య‌లో ఉంచి చ‌పాతీని రోల్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ చ‌పాతీ రోల్స్ త‌యార‌వుతాయి. వీటిని అల్పాహారంగా అలాగే స్నాక్స్ గా కూడా తీసుకోవ‌చ్చు. ఈ వెజ్ చ‌పాతీ రోల్స్ ను తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

Tags: Veg Rolls
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Diabetes And Mouth : మీ నోట్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు డ‌యాబెటిస్ ఉన్న‌ట్లే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.