Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Carrot Rice : క్యారెట్ రైస్‌ను ఇలా ఈజీగా 5 నిమిషాల్లో చేయండి.. లంచ్‌లోకి బాగుంటుంది..!

D by D
August 31, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Carrot Rice : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. చాలా తేలిక‌గా ఇన్ స్టాంట్ గా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన రైస్ వెరైటీల‌లో క్యారెట్ రైస్ కూడా ఒక‌టి. క్యారెట్ రైస్ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగాఉంటుంది. క‌ల‌ర్ ఫుల్ గా కనిపించే ఈ రైస్ ను పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు క్యారెట్ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ క్యారెట్ రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నెయ్యి – ఒక టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, క్యారెట్ తురుము – ఒక క‌ప్పు, అన్నం – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Carrot Rice recipe in telugu perfect for lunch
Carrot Rice

క్యారెట్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత క్యారెట్ తురుము వేసి వేయించాలి. క్యారెట్ తురుము వేగిన త‌రువాత అన్నం, ఉప్పు వేసి క‌లుపుకోవాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా మ‌రోసారి క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. లంచ్ బాక్స్ లోకి ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ తో రైస్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Carrot Rice
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Palak Curry : చ‌పాతీ, రోటీల్లోకి అదిరిపోయే రుచితో.. పాల‌క్ క‌ర్రీని ఇలా చేయండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.