Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Feet Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ పాదాలు తెల్ల‌గా మారి మెరుస్తాయి..!

D by D
September 16, 2023
in అందానికి చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Feet Health : మ‌నలో చాలా మందికి ముఖం అందంగా, తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి పాదాలు మాత్రం న‌ల్ల‌గా ఉంటాయి. చాలా మంది ముఖంపై తీసుకున్నంత శ్ర‌ద్ద పాదాల‌పై తీసుకోక‌పోవ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఎండలో తిర‌గ‌డం, పాదాల‌పై దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, పాదాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత పాదాలు న‌ల్ల‌గా మార‌తాయి. చాలా మంది పాదాలు న‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల వారికి న‌చ్చిన చెప్పుల‌ను ధ‌రించ‌లేక‌పోతూ ఉంటారు. పాదాలు న‌ల్ల‌గా ఉన్న‌వారు ఇప్పుడు చెప్పే చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల పాదాలు తిరిగి సాధార‌ణ రంగులోకి వ‌స్తాయి. పాదాల‌పై ఉండే న‌లుపు, మృత‌క‌ణాలు తొల‌గిపోయి పాదాలు అందంగా త‌యార‌వుతాయి.

ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ద‌మైన ప‌దార్థాల‌తో పాదాల‌ను తెల్ల‌గా, అందంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాదాలు న‌ల్ల‌గా ఉన్న‌వారు ముందుగా వాటిపై ఉండే మురికి, మృత‌కణాలు తొల‌గిపోయేలా స్క్ర‌బింగ్ చేసుకోవాలి. దీనికోసం మ‌నం పంచ‌దార‌ను, నిమ్మ‌కాయ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీని కోసం పాదాల‌ను శుభ్రంగాక‌డిగి గోరు వెచ్చ‌ని నీటిలో ఉంచాలి. త‌రువాత స‌గానికి క‌ట్ చేసిన నిమ్మ‌కాయ ముక్క‌ను తీసుకుని దానిపై పంచ‌దార‌ను చ‌ల్లి పాదాల‌పై రుద్దాలి. ఇలా 10 నిమిషాల పాటు చేసిన త‌రువాత పాదాల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి పోయేలా తుడ‌వాలి. త‌రువాత పాదాల‌కు మాయిశ్చ‌రైజ‌ర్ ను రాసుకోవాలి. అలాగే బ‌ట‌య‌కు వెళ్లిన ప్ర‌తిసారి స‌న్ స్క్రీన్ లోష‌న్ ను రాసుకోవాలి. త‌రువాత ఒక ట‌బ్ లో రెండు క‌ప్పుల వేడి నీటిని తీసుకుని అందులో ఒక క‌ప్పు పాలు, గుప్పెడు గులాబి రేకులు వేసుకోవాలి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Feet Health follow these remedies to remove problems
Feet Health

ఈ నీటిలో పాదాల‌ను ఉంచాలి. ఇలా అర‌గంట పాటు ఉంచిన త‌రువాత పాదాల‌ను బ‌య‌ట‌కు తీసి శుభ్రంగా క‌డిగి త‌డిలేకుండా తుడుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాలు మృదువుగా అవ్వ‌డంతో పాటు పాదాల రంగు కూడా మెరుగుప‌డుతుంది. త‌రువాత పాదాల‌కు ప్యాక్ ను వేసుకోవాలి. దీని కోసం గిన్నెలో 2 టీ స్పూన్ల శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ కీర‌దోస ర‌సం, ఒక టీ స్పూన్ ట‌మాట ర‌సం, 2 టీ స్పూన్ల నిమ్మ‌ర‌సం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పాదాల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాసి 5 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. దీనిని త‌డి ఆరే వ‌ర‌కు అలాగే ఉంచి ఆ త‌రువాత శుభ్రం చేసుకోవాలి. త‌రువాత పాదాల‌కు మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి. ఇలా త‌రుచూ చేస్తూ ఉండ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా న‌ల్ల‌గా ఉన్న పాదాలు తెల్ల‌గా మారిపోతాయి.

Tags: Feet Health
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Onion Pickle : చుక్క నూనె కూడా లేకుండా ఉల్లిపాయ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.