Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Champaran Egg Curry : ఎప్పుడూ చేసే కోడిగుడ్డు కూర కాకుండా.. ఇలా ఒక్క‌సారి వెరైటీగా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

D by D
September 18, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Champaran Egg Curry : మ‌నలో చాలా మంది ఎగ్ క‌ర్రీని ఇష్టంగా తింటారు. ఎగ్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. ఎలా చేసిన కూడా ఎగ్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకేర‌కంగా కాకుండా ఈ ఎగ్ క‌ర్రీని మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చంపార‌న్ స్టైల్ లో చేసే ఈ ఎగ్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. మ‌రింత రుచిగా చంపార‌న్ స్టైల్ లో ఎగ్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చంపార‌న్ ఎగ్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ఉడికించిన ట‌మాటాలు – 3, ఆవాల నూనె – 5 టేబుల్ స్పూన్స్, ఉడికించిన కోడిగుడ్లు – 6, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – ఒక టీ స్పూన్, అల్లం పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు – 4, శుభ్ర‌మైన క‌డిగిన వెల్లుల్లి పాయ‌లు – 3, కారం – 2 టీ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, జీల‌కర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, నీళ్లు – త‌గిన‌న్ని, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Champaran Egg Curry recipe in telugu make in this method
Champaran Egg Curry

చంపార‌న్ ఎగ్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ట‌మాటాల‌పై ఉండే పొట్టును తీసేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత చిన్న క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్ల‌కు గాట్లు పెట్టుకుని వేసుకోవాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన తరువాత కొద్దిగా ఉప్పు, కారం, ప‌సుపు వేసి కల‌పాలి. వీటిని మ‌రో అర నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, దాల్చిన చెక్క‌, బిర్యానీ ఆకు, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, ప‌చ్చిమిర్చి పేస్ట్ వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గం వేగిన త‌రువాత వెల్లుల్లి పాయ‌లు వేసి క‌ల‌పాలి.

ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత కారం, మిరియాల పొడి, ప‌సుపు, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాట పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని చ‌క్క‌గా వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి వెల్లుల్లి పాయ‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత వేయించిన కోడిగుడ్లు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగాఉండే ఎగ్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఎగ్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Champaran Egg Curry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Instant Oats Idli : ఓట్స్‌తో ఇలా ఇన్‌స్టంట్‌గా 10 నిమిషాల్లో ఇడ్లీలు చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.