Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Gongura Tomato Kura : గోంగూర ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. అన్నంలో వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
October 14, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Gongura Tomato Kura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. గోంగూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. గుండె ఆరోగ్యాన్నిమెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌తను త‌గ్గించ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా గోంగూర మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. గోంగూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా గోంగూర‌తో ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూర‌, ట‌మాట‌లు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, వెజ్ బిర్యానీ వంటి వాటిలోకి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ గోంగూర ట‌మాట క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర ట‌మాట కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌చ్చిమిర్చి – 10 నుండి 15, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన పెద్ద ట‌మాట – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గోంగూర క‌ట్ట‌లు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి).

Gongura Tomato Kura recipe in telugu make in this method
Gongura Tomato Kura

గోంగూర ట‌మాట కూర త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై మ‌గ్గించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌ల‌ను మ‌గ్గించాలి. ట‌మాట ముక్క‌లు పూర్తిగా మ‌గ్గిన త‌రువాత గోంగూర ఆకులు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ గోంగూర‌ను మ‌గ్గించాలి. గోంగూర మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప‌ప్పు గుత్తితో గోంగూర‌ను మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ఆన్ చేసి చిన్న మంట‌పై మూత పెట్టి ఉడికించాలి. గోంగూర పూర్తిగా ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర ట‌మాట కూర త‌యార‌వుతుంది. ఈ కూర‌ను తాళింపు కూడా చేయ‌వ‌చ్చు. ఇలా త‌యారు చేసిన గోంగూర ట‌మాట కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Gongura Tomato Kura
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Palli Chaat : సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడిగా ప‌ల్లీల చాట్ చేసి తినండి.. రుచి అదుర్స్ అంటారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.