Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Usirikaya Nilva Pachadi : ఉసిరికాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. ఏకంగా సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది..!

D by D
November 18, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Usirikaya Nilva Pachadi : మ‌నం సంవ‌త్స‌రానికి స‌రిప‌డా వివిధ ర‌కాల నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం త‌యారు చేసే నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో ఉసిరికాయ నిల్వ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ ప‌చ్చ‌డి చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ ప‌చ్చ‌డిని మ‌నం మ‌రో విధంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉసిరికాయ‌ల‌ను తొక్కుగా చేసి దానితో కూడా మ‌నం నిల్వ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసే ప‌చ్చ‌డి కూడా సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది. ప‌చ్చడి పెట్ట‌డం రాని వారు కూడా ప‌చ్చ‌డిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా ఉండే ఈ ఉసిరికాయ నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ఉసిరికాయ‌లు – పావుకిలో, వెల్లుల్లి రెబ్బ‌లు – 12, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – 30 గ్రా., కారం – 40 గ్రా., వేయించిన మెంతుల పిండి – అర టీస్పూన్, నిమ్మ‌ర‌సం – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 300 ఎమ్ ఎల్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఎండుమిర్చి – 3, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ఇంగువ – పావు టీ స్పూన్.

Usirikaya Nilva Pachadi recipe in telugu very tasty
Usirikaya Nilva Pachadi

ఉసిరికాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఉసిరికాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత వీటిని ముక్క‌లుగా చేసుకుని లోపల ఉండే గింజ‌ల‌ను తీసివేయాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను జార్ లో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌సుపు, ఉప్పు, కారం, మెంతుల పిండి, నిమ్మ‌ర‌సం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండుమిర్చి, ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఇంగువ వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి క‌ల‌పాలి. ఈ ప‌చ్చ‌డి పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత దీనిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఉసిరికాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డి సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది. అన్నంతో తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది.

Tags: Usirikaya Nilva Pachadi
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Methi Leaves In Winter : చ‌లికాలంలో మెంతి ఆకుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.