Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chicken Lollipop : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ లాలిపాప్స్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

D by D
November 23, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chicken Lollipop : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌ల్లో చికెన్ లాలిపాప్స్ కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్టాట‌ర్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ చికెన్ లాలిపాప్స్ ను మం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్స్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్స్ ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ లాలిపాప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చికెన్ లెగ్ పీసెస్ – 7, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, సోయా సాస్ – అర టీ స్పూన్, షెజ్వాన్ సాస్- ఒక టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, రెడ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు.

Chicken Lollipop recipe in telugu make them in restaurant style
Chicken Lollipop

టాసింగ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ – అర టీ స్పూన్, ట‌మాట సాస్ – 2 టీ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ – 2 టీస్పూన్స్, మిరియాల పొడి -అర టీ స్పూన్, షెజ్వాన్ సాస్ – అర టీ స్పూన్, వెనిగ‌ర్ – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

చికెన్ లాలిపాప్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ను తీసుకుని వాటిని లాలిపాప్ లాగా క‌ట్ చేసుకోవాలి. లెగ్ పీసె చివ‌ర‌న ప‌ట్టుకుని స్కిన్ ను నెమ్మ‌దిగా క‌ట్ చేస్తూ పైకి అనాలి. పైన ఎక్కువ‌గా ఉండే చికెన్ ను క‌ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గ‌రం మ‌సాలా, సోయా సాస్, షెజ్వాన్ సాస్, నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి అర‌గంట పాటు ప‌క్కకు ఉంచాలి. త‌రువాత ఇందులో మైదాపిండి, ఫుడ్ క‌ల‌ర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిని నూనెలో వేసి వేయించాలి.

ఈ పీసెస్ ను అటూ ఇటూ తిప్పుతూ మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత టాసింగ్ కు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత సోయా సాస్, ట‌మాట సాస్, రెడ్ చిల్లీ సాస్, మిరియాల పొడి, షెజ్వాన్ సాస్, వెనిగ‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత చికెన్ లాలిపాప్స్ వేసి వేయించాలి. వీటికి మ‌సాలాల‌న్నీ చ‌క్క‌గా ప‌ట్టే వ‌ర‌కు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ లాలీపాప్స్ త‌యార‌వుతాయి. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా చికెన్ లాలిపాప్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Chicken Lollipop
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Foods For LDL : చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. అయితే వీటిని రోజూ తినండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.