Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ragi Roti : రోజూ మీరు తినే సాధార‌ణ చ‌పాతీల‌కు బ‌దులుగా ఈ రొట్టెల‌ను తిని చూడండి.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

D by D
February 20, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ragi Roti : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. ఎంతో కాలంగా వీటిని మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. ఇవి ఎంతో ప్ర‌జాదార‌ణ పొందిన చిరుధాన్యాలుగా చెప్ప‌వ‌చ్చు. రాగుల్లో అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగుల‌ను పిండిగా చేసి జావ‌తో పాటు ఇత‌ర వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. రాగుల‌తో చేసుకోద‌గిన వాటిల్లో రాగి రొట్టెలు కూడా ఒక‌టి. రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఏ కూర‌తో తిన‌డానికైనా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగి రొట్టెల‌ను తీసుకోవడం వ‌ల్ల‌ మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాగులల్లో క్యాల్షియం, ఐర‌న్, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోష‌కాలు ఉంటాయి.

రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. అదేవిధంగా రాగుల‌ల్లో గ్లూటెన్ ఉండ‌దు. కనుక గ్లూటెన్ సెన్సిటివిటీతో బాధ‌ప‌డే వారు వీటి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే రాగుల యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక ఇవి ర‌క్తంలోకి చ‌క్కెర‌ల‌ను నెమ్మ‌దిగా విడుద‌ల చేస్తాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వెంట‌నే పెర‌గ‌వు. షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. క‌నుక షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారు రాగుల‌తో రొట్టెల‌ను చేసి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్కెర స్థాయిల‌ను ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంచుకోవ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Ragi Roti many wonderful health benefits
Ragi Roti

ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. దీంతో మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఎముక‌లు గుల్ల‌బార‌డం వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. దీనిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి గుండె జ‌బ్బులు రాకుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాగే రాగులల్లో ఫినాలిక్ యాసిడ్, ఫ్లేవ‌నాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క‌ణాల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో మ‌నం దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తి ల‌భిస్తుంది. నీర‌సం మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. మ‌నం రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఈ విధంగా మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Tags: Ragi Roti
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Egg Roast : ఎగ్ రోస్ట్‌ను ఇలా సింపుల్‌గా టేస్టీగా చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.