Chintakaya Charu : చింతకాయ చారు.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
Chintakaya Charu : మనం వంటింట్లో కూరలనే కాకుండా పప్పు చారు, సాంబార్, పులుసు కూరల వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. వీటి తయారీలో మనం చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే వివిధ రకాల పచ్చళ్ల తయారీలో కూడా చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. మనం చింతపండునే కాకుండా పచ్చి చింతకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని కూడా వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది వీటిని నేరుగా తింటూ ఉంటారు కూడా….