దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?
పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు. ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు…