బైపాస్ సర్జరీ చేయించుకున్నారా..? అయితే ఈ జాగ్రత్తలను పాటించాల్సిందే..!
కొందరిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చిన తర్వాత వారికి బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకసారి చేసిన తర్వాత మరోసారి కూడా చేయాల్సిరావచ్చు. కాబట్టి బైపాస్ సర్జరీ చేసుకున్న రోగులు ఆ తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరం రక్తపోటును, కొవ్వును, బరువు పెరగడాన్ని మీకుగా మీరు నియంత్రించుకుంటుండాలి. బైపాస్ సర్జరీ ద్వారా గుండెలో పేరుకుపోయిన కొవ్వును తొలగించలేరు, కేవలం గుండెకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా వైద్యులు చేస్తారు. సర్జరీ తర్వాత…