ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదే.. ఇలా తీసి ఉంటే హిట్టేనట ?
మల్టీ స్టార్ అంటేనే ప్రేక్షకుడు ఎన్నో అంచనాలతో థియేటర్ కు వెళ్తాడు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ఒకే సినిమాలో ఉన్నారంటే హైపు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు, చరణ్ నటించిన చిత్రం ఆచార్య. అయితే, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మొత్తం రూ. 130 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ జరగగా…