పక్కపక్కనే ఉన్నా కూడా బెజవాడ-గుంటూరుల నడుమ కొంత సాంస్కృతికమైన తేడా ఉంది. అది ఎందుకు ఏర్పడింది?

బెజవాడ (విజయవాడ) – గుంటూరు నగరాలే కాదు, కృష్ణా – గుంటూరు జిల్లాల ప్రజల మధ్యన కూడా యాస, ఆహారపు అలవాట్లు, ఆచారాలు – సంప్రదాయాలు కొంత తేడా ఉంటాయి. చివరికి అవనిగడ్డ – తెనాలి గట్లవారు కూడా కొన్ని విషయాలలో ఎకసెక్కాలు ఆడుకుంటారు. చారిత్రకముగా చూసుకుంటే కృష్ణా నది చాలా వంశాల పాలనలో సరిహద్దు ప్రాంతముగా ఉన్నది. విజయవాడ ప్రాంతము ఎక్కువ శతాబ్దాలు వేంగీ, రాజమహేంద్రవరము, కళింగ ప్రాంతాలు రాజధానిగా ఏలిన రాజ్యములలో ఉంటే, గుంటూరు … Read more

గుహ‌లో త‌ల‌కిందులుగా ప‌డి ప్రాణాలు కోల్పోయాడు.. దాన్ని అత‌ని స‌మాధిగా మార్చేశారు..

జాన్ ఎడ్వర్డ్ జోన్స్ అనే పర్వతోహకుడు 28 గంటల తర్వాత నట్టి పుట్టీ గుహలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నవంబరు 24, 2009న జరిగింది. తన సోదరుడు జోష్‌తో కలిసి గుహలో అన్వేషిస్తున్నప్పుడు, జోన్స్ ప్రమాదవశాత్తూ ఒక ఇరుకైన సొరంగంలోకి ప్రవేశించాడు. అతను గుహ ప్రవేశ ద్వారం నుండి సుమారు 400 అడుగుల (120 మీ) దూరంలో ఉన్న 10 x 18 అంగుళాలు (25 x 46 సెం.మీ.)లో తలక్రిందులుగా చిక్కుకున్నాడు. ఆ … Read more

రోడ్డు పక్కన ఉండే మైలు రాళ్లకు రంగులు ఎందుకు ఉంటాయి..!

మనం రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక విషయాలను గమనిస్తూ ఉంటాం. రోడ్డు పక్కన చెట్లు మధ్యలో డివైడర్లు ఇలా అనేకం రోడ్డుపై ఉంటాయి. మనం వెళ్లే దారి ఎన్ని కిలోమీటర్లు ఉంది, అనే విషయాన్ని అందులో పొందుపరుస్తారు. కానీ రోడ్డు పక్కన కిలోమీటర్లు మరియు వివిధ కలర్ లతో ఉండే మైలురాళ్లను మీరు ఎప్పుడైనా గమనించారా.. వాటిపై ఊరు పేరు మరియు ఆ గ్రామం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది రాసి ఉంటుంది. అలాగే వాటికి డిఫరెంట్, … Read more

రైల్వే ప్లాట్ఫామ్ మీద అంచున ఉండే ఈ పసుపు రంగు లైన్ ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..?

భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అనే చెప్పాలి. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్దది. ఆసియా లోనే రెండవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా ఉంది. రైలు దేశ ట్రాఫిక్ వ్యవస్థకు వెన్నెముక. ప్రతిరోజు లక్షలాదిమంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. రైల్వే నెట్వర్క్ దాదాపు అన్ని నగరాలను కనెక్ట్ చేస్తుంది కాబట్టి విమానాశ్రయాలు, రన్వేలు లేని ప్రదేశాలకు కూడా … Read more

మందు ఎందుకు ఎప్పటికీ పాడవదు? సీక్రెట్ ఇదే!

మద్యం ప్రియులు ఎప్పుడు సమావేశమైనా మధ్యలో మద్యం ఎంత పాతదైతే అంత రుచిగా ఉంటుందని, అంతేకాకుండా పాత మద్యం చాలా ఖరీదైనదిగా కూడా ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే, మద్యం సంవత్సరాల తరబడి నిల్వ చేసినా ఎందుకు పాడవదు? దాని ధర ఎందుకు పెరుగుతుంది? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మద్యానికి ఎక్స్‌పైరీ డేట్ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఉపయోగిస్తున్న మద్యం రకంపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మద్యం రెండు రకాలుగా ఉంటుంది: అన్‌డిస్టిల్డ్ … Read more

రహదారుల పక్కన చెట్లకు తెలుపు , ఎరుపు రంగు పెయింట్ లను ఎందుకు వేస్తారో తెలుసా?

రహదారులపై మనం ప్రయాణించేటప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటి పక్కన ఉండే చెట్లను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అందుకనే చాలామంది ప్రయాణాలను చేయడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే రహదారుల పక్కన ఉండే చెట్లకు చాలాచోట్ల కింది భాగంలో తెలుపు… దాని మీద పై భాగంలో కొద్దిగా ఎరుపు రంగు పెయింట్ లను వేస్తారు. చూశారు కదా. ఇలా ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చెట్లకు ఇలా తెలుపు, ఎరుపు రంగు పెయింట్ వేశారంటే… అవి అటవీశాఖ … Read more

ఫిరంగీ బ్యారెల్ (గొట్టం) ఉంచే ప్లేస్ ను బట్టి దాని ప్రత్యేకతను తెల్పొచ్చు.అదెలాగో తెలుసుకోండి.

దేశాన్ని, దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో ఆర్మీ కీల‌కపాత్ర పోషిస్తుంది. మాతృదేశాన్ని ర‌క్షించాల‌నే త‌ప‌న‌తో ఎంతో మంది యువ‌కులు ఆర్మీలో చేరుతుంటారు కూడా. ఎన్నో క‌ష్టాల‌ను త‌ట్టుకుంటూ స‌రిహ‌ద్దుల్లో దేశం కోసం కాప‌లా కాస్తూ సైనికులు విధులు నిర్వ‌హిస్తుంటారు. విప‌త్క‌ర ప‌రిస్థితులు వ‌స్తే ఎంతో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి దేశాన్ని ఆప‌ద నుంచి ర‌క్షిస్తారు. అందుకోసం వీలైతే ప్రాణాలను కూడా ప‌ణంగా పెడ‌తారు. అయితే సైనికులు ఎంత వీరోచితంగా పోరాడినా స‌రైన ఆయుధాలు లేక‌పోతే వారు శ‌త్రుదేశ సైనికుల‌ను ఎదుర్కొన‌లేరు. … Read more

ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక‌…జ‌డ్జ్ లు త‌మ పెన్ మొన‌( Nib) ను విర‌గొడ‌తారు., ఎందుకో తెలుసా?

ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక‌…ఆ తీర్పు ఇచ్చిన జ‌డ్జ్ లు… ఆ ముద్దాయి కేసుకు సంబంధించిన పేప‌ర్స్ పై సంత‌కం చేసి…ఆ పెన్ మొన‌( Nib) ను విర‌గొడ‌తారు.! ఇది కొత్త‌గా వ‌చ్చిందేం కాదు…బ్రిటీష‌ర్స్ మ‌న‌ల్ని ప‌రిపాలిస్తున్న కాలం నాటి నుండి ఈ ఆచార‌మే కంటిన్యూ అవుతూ ఉంది.! అస‌లు జ‌డ్జ్ లు ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక గ‌ల కార‌ణంలేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.! దీని వెనుక పెద్ద సైంటిఫిక్ కార‌ణాలు లేన‌ప్ప‌టికీ, మాన‌వీయ కార‌ణాలున్నాయి. … Read more

ఫోన్ కీ ప్యాడ్లు, కాలిక్యులేట‌ర్ నంబ‌ర్ ప్యాడ్లు వ్య‌తిరేక దిశ‌లో నంబ‌ర్ల‌ను క‌లిగి ఉంటాయి… ఎందుకో తెలుసా..?

చిన్న చిన్న కూడిక‌లు, తీసివేత‌లు, గుణకారాలు, భాగ‌హారాలు చేయాలంటే ఎవ‌రైనా ఇప్పుడు ఏం వాడుతున్నారు? ఏం వాడుతారు, స్మార్ట్‌ఫోన్లు. అవును, మీరు చెప్పింది క‌రెక్టే. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. దీంతో లెక్క‌ల పరంగా ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా వెంట‌నే స్మార్ట్‌ఫోన్‌ను తీయ‌డం, కాలిక్యులేట‌ర్ ఓపెన్ చేయ‌డం, లెక్క‌లు చేయ‌డం వంటి ప‌నులు ఫాస్ట్‌గా చేస్తున్నారు. అయితే అలా అని చెప్పి సాధార‌ణ కాలిక్యులేట‌ర్ల‌ను మ‌రీ పూర్తిగా వాడ‌డం లేద‌ని కాదు. వాటిని వాడే … Read more

ఆదివారమే ఎందుకు సెలవు ఇస్తారో మీకు తెలుసా..?

ప్రస్తుతం జాబ్ చేసేవారు వారమంతా కష్టపడి ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం రోజు సెలవు కాబట్టి. అసలు ఆదివారమే సెలవు దినంగా ఎందుకు ప్రకటించారు. అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఆదివారం సెలవు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో కొంతమందికి మాత్రమే తెలుసు. ఆదివారం సెలవు అనేది నారాయణ ముఖర్జీ పుణ్యమే అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో బ్రిటిష్ … Read more